Thursday, April 25, 2024

జీఎస్టీ మండలి కీలక నిర్ణయాలు ఇవే!

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొవిడ్​ మందులు, పరికరాలపై జీఎస్​టీ తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ వెల్లడించారు. సింగిల్ అజెండాతో జీఎస్టీ మండలి సమావేశం జరిగిందని తెలిపారు. కరోనా ఔషధాలు, పరికరాలపై పన్నులు తగ్గించినట్టు చెప్పారు.

కరోనా అత్యవసర వస్తువులు, బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సా ఔషధాలు సహా పలు రకాల మందులపై పన్ను రేట్లను తగ్గించాలని పెద్ద ఎత్తున డిమాండ్‌లు వస్తున్న వేళ జీఎస్​టీ మండలి ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. మెడికల్‌ గ్రేడ్‌ ఆక్సిజన్‌లు, ఆక్సిజన్ కాన్సన్​ట్రేటర్‌లు, వెంటిలేటర్‌లు, పల్స్‌ ఆక్సీమీటర్లు, కొవిడ్‌ పరీక్షా కిట్‌లు, మాస్కులపై పన్నును 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. హ్యాండ్ శానిటైజర్‌లపై పన్నును 18 నుంచి 5 శాతానికి తగ్గిస్తూ జీఎస్​టీ మండలి నిర్ణయం తీసుకుంది. కరోనా అత్యవసర చికిత్సలో వినినియోగించే రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌పై పన్నును 12శాతం నుంచి 5శాతానికి తగ్గించింది. అయితే, వ్యాక్సిన్లపై 5 శాతం జీఎస్​టీని యథాతథంగానే కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఆంఫోటెరిసినియన్‌-బీ వంటి ఔషధాలపై ఎలాంటి పన్ను విధించరాదని జీఎస్​టీ మండలి నిర్ణయించింది. ఈ తగ్గింపు 2021 సెప్టెంబర్‌ 30 వరకు అమలులో ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: సీఎం కేసీఆర్ ఆకస్మిక తనిఖీలు.. ఎప్పుడంటే..

Advertisement

తాజా వార్తలు

Advertisement