Tuesday, March 26, 2024

Big Boss5 : హ‌గ్గులు ఇవ్వ‌డం న‌చ్చ‌డం లేదు: సిరి తల్లి మాటకు హర్ట్ అయిన షణ్ను!

తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ సిజన్ 5 తుది దశకు చేరుకుంటోంది. మరి కొద్ది రోజుల్లో షా పూర్తి కానుంది. గత 80 రోజులుగా ఫ్యామిలీని మిస్ అవుతున్న ఇంటి సభ్యులకు బిగ్ బాస్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఒక్కొక్క ఇంటి సభ్యుల ఫ్యామిలీ మెంబర్స్ బిగ్ బాస్ హౌస్ లో సందడి చేస్తున్నారు. మొన్న కాజల్ .. భర్తి, కూతురు ఇంట్లోకి రాగా.. నిన్నటి ఎపిసోడ్ లో సిరి తల్లి వచ్చింది. బీబీ ఎక్స్‌ప్రెస్‌ టాస్క్‌ జరుగుతున్న స‌మ‌యంలో సిరి త‌ల్లి శ్రీదేవి హౌజ్‌లోకి వ‌చ్చారు. తన తల్లిని చూసి సిరి.. ఎమోషనల్ అయింది.

ఇంటి సభ్యులతో శ్రీదేవి మాట్లాడుతూ.. సిరిని ఎంతో కష్టపడి చదవించానని, ఎన్నో మాటలు పడ్డానని చెప్పారు. సిరి త‌ల్లిగా న‌న్ను గుర్తిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని శ్రీదేవి అన్నారు. ఈ సందర్భంగా ష‌ణ్ముఖ్‌ని ప‌దే ప‌దే హ‌గ్‌లు చేసుకోవ‌డం నాకు న‌చ్చ‌డం లేద‌ని శ్రీదేవి అంద‌రి ముందే చెప్పేసింది. ష‌ణ్ముఖ్ ఎక్కువ‌గా సాయం చేస్తున్నందుకు అతనికి బాగా ద‌గ్గ‌ర అవుతున్న‌ట్టు ఉంది అని శ్రీదేవి అన్నారు. దీంతో సిరి ఆమె త‌ల్లిని ప‌క్క‌కు తీసుకెళ్లి అలా అన‌కూడ‌ద‌డంటూ కోప్ప‌డింది. అనంతరం ఇంటి సభ్యులతో మాట్లాడి శ్రీదేవి హౌస్ నుంచి బయటికి వెళ్లారు. అయితే శ్రీదేవి మాట‌ల‌కు ష‌ణ్ముఖ్ చాలా హ‌ర్ట్ అయ్యాడు. ఆమె తల్లి మాట్లాడుతున్న‌ప్పుడు సిరి ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఒంటరిగా కూర్చుని ఏడ్చేశాడు. నిజానికి సిరి, షణ్ను చాలా క్లోస్ గా ఉంటారని అందరికీ తెలుసు. అయినా సిరి తల్లి అలా మాట్లాడడాన్ని షణ్ను తీసుకోలేకపోయాడు. బయట జనం కూడా తమ ఇద్దరి గురించి అలా మాట్లాడుకుంటున్నారా? అని బాధపడ్డాడు. అయితే, సిరి తల్లి బయట ప్రజలు మాట్లడుకున్నదే షణ్ను ముందు చెప్పిందా? లేక తరచూ హగ్ చేసుకోవడం నచ్చక అలా అన్నదా? అన్నది కన్ఫ్యూజన్ క్రియేట్ అయిందని సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement