Saturday, April 20, 2024

సైమా 2021: మహేష్ ఖాతాలో మరో అవార్డ్..

సైమా 2021 అవార్డుల వేడుకలో మహర్షి మూవీ సత్తా చాటింది. నిన్న రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకిక పలువురు టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకలో “మహర్షి” హవా కనిపించింది. ఈ సినిమా ఉత్తమ నటుడు (మహేష్ బాబు), ఉత్తమ దర్శకుడు (వంశీ పైడిపల్లి), ఉత్తమ సంగీత స్వరకర్త (దేవి శ్రీ ప్రసాద్), ఉత్తమ సహాయ నటుడు (అల్లరి నరేష్), ఉత్తమ సాహిత్యం (ఇదే కథ కోసం శ్రీమణి) సహా మొత్తం 5 అవార్డులు గెలుచుకుంది. ఇతర అవార్డుల విషయానికి వస్తే నాని ‘జెర్సీ’ ఉత్తమ చిత్ర అవార్డును గెలుచుకుంది. ‘జెర్సీ’ నిర్మాత నాగ వంశీ ఈ అవార్డును స్వీకరించారు. మరోవైపు అనిల్ రావిపూడి మరియు దిల్ రాజు ‘ఎఫ్ 2’ కోసం తమ అవార్డును అందుకున్నారు. ‘ఓ బేబీ’కి సమంత ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. ‘జెర్సీ’ కోసం నాని క్రిటిక్స్ ఛాయిస్ ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్నాడు. డియర్ కామ్రేడ్ కోసం క్రిటిక్స్ ఛాయిస్ ఉత్తమ నటి అవార్డును రష్మిక మందన్న గెలుచుకుంది. ‘గ్యాంగ్ లీడర్’లో విలన్ గా కార్తికేయ ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నాడు.

‘సైమా’ అవార్డ్స్ 2019 (తెలుగు) విజేతల వివరాలు ఇలా ఉన్నాయి :
ఉత్తమ చిత్రం: జెర్సీ (సితార ఎంటర్‌‌టైన్‌మెంట్స్)
ఉత్తమ వినోదాత్మక చిత్రం: ఎఫ్2 (శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్)
ఉత్తమ దర్శకుడు: వంశీ పైడిపల్లి (మహర్షి)
ఉత్తమ నటుడు: మహేష్ బాబు (మహర్షి)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్): నాని (జెర్సీ)
ఉత్తమ నటి: సమంత (ఓ బేబీ)
ఉత్తమ నటి (క్రిటిక్స్): రష్మికా మందన్న (డియర్ కామ్రేడ్)
ఉత్తమ సహాయ నటుడు: అల్లరి నరేష్ (మహర్షి)
ఉత్తమ సహాయ నటి: లక్ష్మీ (ఓ బేబీ)
ఉత్తమ సంగీత దర్శకుడు: దేవిశ్రీ ప్రసాద్ (మహర్షి)
ఉత్తమ గేయ రచయిత: శ్రీమణి(ఇదే కదా.. మహర్షి)
ఉత్తమ గాయకుడు: అనురాగ్ కులకర్షి(ఇస్మార్ట్ శంకర్-టైటిల్ సాంగ్)
ఉత్తమ గాయని: చిన్మయి (మజిలీ-ప్రియతమా)
ఉత్తమ విలన్: కార్తికేయ గుమ్మకొండ (నానిస్ గ్యాంగ్ లీడర్)
ఉత్తమ తొలి పరిచయ హీరో: శ్రీ సింహా (మత్తు వదలరా)
ఉత్తమ తొలి పరిచయ హీరోయిన్: శివాత్మిక రాజశేఖర్ (దొరసాని)
ఉత్తమ తొలి పరిచయ దర్శకుడు: స్వరూప్ ఆర్ఎస్‌జె (ఏజంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ)
ఉత్త తొలి పరిచయ నిర్మాత: స్టూడియో 99 (మల్లేశం)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్: సానూ వర్గీస్‌ (జెర్సీ)
ఉత్తమ కమెడియన్: అజయ్ ఘోష్ (రాజుగారి గది 3)

Advertisement

తాజా వార్తలు

Advertisement