Friday, March 29, 2024

Big Story: దేశ, విదేశీ పర్యాటకులతో కళకళలాడుతున్న సందర్శనీయ ప్రదేశాలు.. టూరిజం అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఇంపార్టెన్స్​​

తెలంగాణ కోటి రతనాల వీణ.. దక్కన్ పీఠభూమిలో ప్రకృతి రమనీయత, సహజ జలవనరులు, తటాకాలు, కొండలు, కోనలు, కోటలు, ఆధ్యాత్మిక ప్రాంతాలకు నిలయంగా ఉంది. ఇన్ని వైవిధ్యమైన ప్రదేశాలున్న తెలంగాణ ప్రాంత పర్యాటక రంగం ఉమ్మడి పాలనలో నిర్లక్ష్యానికి గురయ్యింది. కనీసం ప్రచారానికి కూడా నోచుకోలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో తెలంగాణ పర్యాటక రంగానికి నూతన జవసత్వాలు సంతరించుకుంటున్నాయి. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, సహజ వనరులు, అభివృద్ధి పట్ల సంపూర్ణ అవగాహన ఉన్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తెలంగాణను టూరిజం డెస్టినేషన్ గా తీర్చిదిద్దుతున్నారు.

రాష్ట్ర పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి, తగిన విధంగా ప్రచుర్యo కల్పించి ప్రోత్సహించేందుకు తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (TSTDC)ని నోడల్ ఏజెన్సీగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సంస్థ రాష్ట్రవ్యాప్తంగా 54 హరిత టూరిజం హోటల్స్, వే సైడ్ వసతులను కల్పించింది. పర్యాటక రంగానికి అనువైన ప్రాంతాల్లో వసతులను అభివృద్ధి చేస్తోంది. 31 టూరిజం బస్సులు, 120 బోట్స్ నడుపుతోంది. గోల్కొండ, వరంగల్ కోటల వద్ద సౌండ్ &లైట్ షో లను నిర్వహిస్తోంది. ఇంగ్లిష్, హిందీ, తెలుగు భాషల్లో డ్రామాటిక్ గా ఈ కోటల కథనాలను గాత్రాలు, సంగీతం, లైట్ ఎఫెక్ట్ తో ప్రదర్శిస్తున్నారు.

ఇక.. ప్రభుత్వం కల్పిస్తున్న వసతులతో తెలంగాణ పట్ల దేశ విదేశీ పర్యాటకుల ఆసక్తి పెరిగింది. డోమెస్టిక్ టూరిజం గణనీయంగా వృద్ధిచెందింది. 2014 నుండి 2022 జులై వరకు తెలంగాణను 63 కోట్ల 51 లక్షల మంది టూరిస్టులు సందర్శించారు. అలాగే 1 లక్ష 35 వేల మంది విదేశి టూరిస్టులు తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. ప్రభుత్వం చేపట్టిన పనులతో పోచంపల్లికి ఉత్తమ పర్యాటక గ్రామంగా ప్రపంచ పర్యాటక సంస్థ నుంచి గుర్తింపు లభించింది.

నాగార్జున సాగర్ వద్ద 65 కోట్లతో బుద్ధవనం ప్రాజెక్ట్ ను తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ములుగు జిల్లా మేడారం గ్రామంలో ఉన్న సమ్మక్క – సారలమ్మ జాతరకు రూ.13.43 కోట్లతో పర్యాటక వసతులను రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. లక్నవరం వద్ద రూ.27.65 కోట్లతో అదనపు వసతులు కల్పించింది. తాడ్వాయిలో రూ.9.36 కోట్లు, గట్టమ్మ గుట్ట వద్ద రూ.7.36 కోట్లు, మల్లూరు వద్ద రూ.4.20 కోట్లు, బొగత వాటర్ ఫాల్స్ వద్ద రూ.11.64 కోట్లు, సోమశిల రిజర్వాయర్ వద్ద రూ.20.87 కోట్లు, సింగోటం రిజర్వాయర్ వద్ద రూ.7.84 కోట్లు, శ్రీశైలం ఈగలపెంట వద్ద రూ.25.96 కోట్లు, ఫర్హాబాద్ మన్ననూరు వద్ద రూ.13.81 కోట్లు, మల్లెల తీర్ధం వద్ద రూ.5.35 కోట్లు, అక్క మహాదేవి గుహలు వద్ద రూ.1.25 కోట్లతో కల్పించిన పర్యాటక వసతులను ప్రజలకు అందుబాటులో ఉంచింది.

- Advertisement -

వీటితో పాటు కోట్లాది రూపాయల వ్యయంతో హరిత పేరున పర్యాటక హోటల్స్ ను నిర్మించింది.ఆధునిక వసతులున్న వాటర్ ఫ్లీట్ బోట్స్, ఏ. సి, వొళ్వో బస్సులను నసుపుతున్నది.అనేక చారిత్రక కట్టడాలను పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దుతున్నది. వీటితో పాటు అన్ని జిల్లాలలోని పర్యాటక ప్రాంతాల్లో వసతులు అభివృద్ధి చేసి అంతర్గత పర్యాటకాన్ని ప్రోత్సాహిస్తున్నది. కోవిడ్​ అనంతరం డోమెస్టిక్ తో పాటు విధేశీ పర్యాటకుల సంఖ్య పెరుగుతున్నది. తెలంగాణ పర్యాటక ప్రాంతాలు సందర్శకులతో కళకళ లాడుతున్నాయి. దీనితో వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement