Friday, April 19, 2024

Spl Story | తల్లి ఎదభాగంలో ఆర్ట్​ వేసిన కుమారులు​​.. సెక్స్​ అప్పీల్​ కాదన్న హైకోర్టు!

ఓ మహిళ తన ఎదభాగాన్ని ప్రదర్శిస్తే అది సెక్స్​ అప్పీల్​గా భావించాల్సిందేనా? మగాళ్లు షర్ట్​ లేకుండా తిరిగితే తప్పులేదా? ఆడాళ్ల విషయంలోనే ఎందుకు ఈ సమస్య వస్తోందని కేరళ హైకోర్టు ప్రశ్నించింది. ఒక మహిళ తన పిల్లలతో ఎద భాగంలో పెయింటింగ్​ వేస్తూ వీడియో చిత్రీకరించిన ఘటనపై పోక్సో కేసు నమోదైంది. మైనర్​ బాలురతో చైల్డ్​ ఫోర్నోగ్రఫీకి పాల్పడుతుందనే అభియోగాలున్నాయి. దీనిపై ఆ మహిళ హైకోర్టుకు వెళ్లారు. కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం సీరియస్​ కామెంట్స్​ చేసింది. కొన్ని నిమ్న కులాల మహిళలు తమ రొమ్ములను కప్పుకునే హక్కు కోసం ఒకప్పుడు పోరాడిన రాష్ట్రం ఇది. బహిరంగ ప్రదేశాల్లో ఫ్రీగా లభించే నగ్న శిల్పాలు, పెయింటింగ్‌లను కళగా, పవిత్రంగా పరిగణిస్తాం. అన్ని దేవతల విగ్రహాలు వట్టి ఛాతీతో ఉంటే ప్రార్థిస్తాం, దైవత్వం అనే భావన కలుగుతుంది. మరి ఓ మహిళ విషయంలో ఎందుకు ఇలా భావిస్తారు? అని కోర్టు ప్రశ్నించింది. మగాళ్లు, ఆడాళ్ల విషయంలో సమాజంలో ఉన్న ద్వంద్వ ప్రమాణాలను కోర్టు తీవ్రంగా విమర్శించింది.

, ఆంధ్రప్రభ

ఒక మహిళ తన నగ్న శరీరానికి చెందిన చిత్రణను లైంగికంగా లేదా, అశ్లీలంగా చూడకూడదని కేరళ హైకోర్టు తెలిపింది. తన పిల్లలు తన సెమీ నగ్న శరీరంపై పెయింటింగ్‌ను చిత్రీకరించినందుకు కేరళకు చెందిన మహిళపై క్రిమినల్ కేసు నమోదు కాగా, దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఆ కేసు నుంచి విముక్తి కల్పించింది. స్త్రీ శరీరాల గురించి, తన పిల్లల సెక్స్ ఎడ్యుకేషన్ కోసం పితృస్వామ్య భావాలను సవాలు చేసేందుకే తాను ఈ వీడియోను రూపొందించానన్న వివరణను కోర్టు గుర్తించింది. వీడియోను అశ్లీలంగా పరిగణించలేమని ధర్మాసనం పేర్కొంది.

ఓ మహిళ నగ్న శరీరాన్ని చూడటం డిఫాల్ట్ గా లైంగికంగా భావించకూడదని కేసు విచారణ సందర్భంగా కోర్టు అభిప్రాయపడింది. అలాగే, స్త్రీ నగ్న శరీర చిత్రణ అశ్లీలమైనదనో, అసభ్యకరమైనదనో, లైంగికంగా అసభ్యకరమైనదిగా పేర్కొనాల్సిన అవసరం లేదని తెలిపింది. సందర్భానుసారంగా మాత్రమే అలా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. మగాళ్ల తమ బాడీని ఓపెన్​గా చూపించవచ్చు. దీనిపై ఎవరూ ప్రశ్నించరు. అయితే స్త్రీల శరీర భాగాలను చూపితే సెక్స్​ అప్పీల్​గా భావించాలా? ఇట్లాంటి పితృస్వామ్య వ్యవస్థతో నిరంతరం ముప్పు ఉంటుంది. మహిళలు వేధింపులకు గురవుతున్నారు. వివక్షకు గురవుతున్నారు. దీంతో వారు ఒంటరిగా విచారణంగా ఉండిపోతున్నారు.. అని కేరళ హైకోర్టు జడ్జి జస్టిస్ కౌసర్ ఎడప్పగత్ తన తీర్పులో పేర్కొన్నారు.

- Advertisement -

స్త్రీ, పురుష శరీరాల విషయంలో సమాజంలోని ద్వంద్వ ప్రమాణాల గురించి కోర్టు తీర్పు పరిశీలనలు చేసింది. నగ్న శరీరాలను మామూలుగా చూసేందుకు వీలుగా పిల్లలు తన శరీరాన్ని కాన్వాస్‌గా చిత్రించుకునేందుకు తల్లి అనుమతిస్తే తప్పేమీ లేదని కోర్టు అభిప్రాయపడింది. ఒక కళాత్మక ప్రాజెక్ట్ గా తన సొంత పిల్లలకు తల్లి ఎద భాగంలో పెయింటింగ్ చేయడం లైంగిక చర్యగా పేర్కొనలేము. అలాగే లైంగిక సంతృప్తి కోసం, ఆ ఉద్దేశ్యంతో అలా చేసినట్లు కూడా చెప్పలేము. ఇక.. ఈ కళాత్మక వ్యక్తీకరణను లైంగిక చర్య కోసం పిల్లవాడిని ఉపయోగించినట్టు పేర్కొనడం కూడా చాలా దారుణం. పిల్లలను అశ్లీల చిత్రాలకు ఉపయోగించినట్లు చూపించడానికి ఇక్కడ ఏమీ లేదు. వీడియోలో లైంగికత గురించి ఎలాంటి సూచన లేదు. దానితో పాటు సందేశంలో, పిటిషనర్ వీడియోకు సంబంధించి తన ఉద్దేశ్యాన్ని తెలియజేశారు అని కోర్టు పేర్కొంది.

కాగా, నగ్నత్వాన్ని తప్పనిసరిగా అశ్లీలంగా లేదా అసభ్యకరంగా, అనైతికంగా వర్గీకరించడం తప్పు. కొన్ని నిమ్న కులాల మహిళలు తమ రొమ్ములను కప్పుకునే హక్కు కోసం ఒకప్పుడు పోరాడిన రాష్ట్రం ఇది. దేశవ్యాప్తంగా ఉన్న పురాతన దేవాలయాలలో కుడ్యచిత్రాలు, విగ్రహాలు, దేవతల కళలు సెమీ న్యూడ్‌లో ఉంటాయి. బహిరంగ ప్రదేశాల్లో ఉచితంగా లభించే ఇలాంటి నగ్న శిల్పాలు, పెయింటింగ్‌లను కళగా, పవిత్రంగా పరిగణిస్తారు. అన్ని దేవతల విగ్రహాలు ఎలాంటి అచ్చాదన లేకుండా, వట్టి ఛాతీతో ఉంటాయి. వాటిని ఆలయంలో ప్రార్థించినప్పుడు.. లింగభేదం అనే సమస్య తలెత్తలేదు.  దైవత్వం అనే భావన కలుగుతుంది అని కోర్టు తెలిపింది. పురుషులు, స్త్రీలలో నగ్నత్వంతో వ్యవహరించేటప్పుడు సమాజంలో ప్రబలంగా ఉన్న ద్వంద్వ ప్రమాణాలను కోర్టు తీవ్రంగా విమర్శించింది.

త్రిస్సూర్​లో పులికలి ఉత్సవాల్లో బాడీ పెయింటింగ్స్​..

కేరళలోని త్రిస్సూర్‌లో జరిగే ‘పులికలి’ ఉత్సవాల్లో పురుషులపై బాడీ పెయింటింగ్ అనేది ఆమోదించబడిన సంప్రదాయం. ఆలయంలో ‘తెయ్యం’ , ఇతర ఆచారాలు నిర్వహించినప్పుడు.. పురుష కళాకారుల శరీరాలపై పెయింటింగ్ నిర్వహిస్తారు. మగాళ్ల శరీరం సిక్స్ ప్యాక్ అబ్స్, కండరపుష్టి మొదలైన వాటి రూపంలో ప్రదర్శిస్తారు. షర్టులు ధరించకుండా తిరుగుతూ ఉంటారు. కానీ, ఈ చర్యలను ఎప్పుడూ అశ్లీలమైనవిగా, లేదా అసభ్యకరమైనవిగా ఎవరూ కంప్లెయింట్​ చేయలేదు.

అదే.. పురుషుడి సగం నగ్న శరీరం సాధారణమైనదిగా భావించినప్పుడు.. లైంగికంగా లేనప్పుడు.. స్త్రీ శరీరం అదే విధంగా ఎందుకు ఉండకూడదు. కొంతమంది వ్యక్తులు స్త్రీ నగ్న శరీరాన్ని అతిగా, లైంగికంగా లేదా కోరిక యొక్క వస్తువుగా పరిగణించడం అలవాటు చేసుకున్నారు. స్త్రీ నగ్నత్వం గురించి మరొక డైమెన్షనల్ వీక్షణ ఉంది. స్త్రీ నగ్నత్వం నిషిద్ధం, ఎందుకంటే నగ్న స్త్రీ శరీరం శృంగార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. ఈ వీడియోను రూపొందించి అప్‌లోడ్ చేయడంలో పిటిషనర్ ఉద్దేశం సమాజంలో ఉన్న ఈ ద్వంద్వ ప్రమాణాన్ని బహిర్గతం చేయడమే అని కోర్టు పేర్కొంది.

ఇక.. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం, 2012, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000, జువైనల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ మరియు రక్షణ) చట్టం, 2015 కింద మహిళపై అభియోగాలు మోపారు. ప్రతి పేరెంట్ తమ పిల్లలకు జీవితం గురించి నేర్పించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు. ప్రతి తల్లిదండ్రులకు తమ పిల్లలను తమకు నచ్చిన రీతిలో పెంచే హక్కు ఉంటుంది. ఏదైనా చర్య వారిపై ఆకట్టుకుంటే తప్ప పిల్లలు సహజంగానే సరైనది లేదా తప్పు అని భావించడం లేదు అని కోర్టు స్పష్టం చేసింది. ఇక.. ఆ మహిళపై పోక్సో చట్టం కింద అభియోగాలను కొట్టివేసింది. అశ్లీల చిత్రాల ఆరోపణలపై వీడియోలో పిల్లలు నగ్నంగా లేరని, హానిచేయని.. సృజనాత్మక కార్యకలాపాలలో పాల్గొంటున్నారని కోర్టు పేర్కొంది.

కాగా, ఆరోపణ ఎదుర్కొంటున్న మహిళ మైనర్ కుమారుడు ఆమె రొమ్ము, ఇతర భాగాలపై చిత్రీకరించడానికి తాకినందున.. ఆమె భంగిమ.. లైంగిక ఉద్దేశంతో సూచిస్తున్నాయని సీనియర్​ పబ్లిక్​ ప్రాసిక్యూటర్​ వాదనలు వినిపించారు. ఈ వీడియోలో పిల్లలతో కూడిన లైంగిక అసభ్యకరమైన విధంగా చిత్రీకరించారని సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ TV నీమా వాదించారు. వీటిన ధర్మాసనం ఏకీభవించలేదు. స్త్రీకి పూర్తి స్వేచ్ఛ ఉందని, ఈ విషయంలో తప్పు పట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement