Saturday, April 20, 2024

సిద్ధా సాగా.. ఆచార్య‌ టీజ‌ర్ రిలీజ్‌..

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న తాజా చిత్రం ఆచార్య. చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా .. స్పెష‌ల్ రోల్‌లో రామ్ చరణ్‌, పూజా హెగ్డే క‌న‌ప‌డ‌బోతున్నారు. ఈ మూవీని టాలీవుడ్ స‌క్సెస్ ఫుల్‌ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నారు. భారీ బ‌డ్జ‌ట్ తో తెర‌కెక్కనున్న ఈ చిత్రానికి మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా, రిలీజ్ డేట్ కూడా రెడీ అయ్యింది. ఆచార్య నుంచి ఫస్ట్ సింగిల్, పోస్టర్లు విడుదల‌య్యాయి. రోజు రోజుకూ అభిమానుల ఆశ‌ల‌కు త‌గ్గ‌ట్టు అంచనాలు పెంచుతోంది ఈ మూవీ… అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి మరో బిగ్ అప్‌డేట్ ఇచ్చింది సినిమా టీమ్‌. సిద్దా సాగా అంటూ రామ్ చ‌ర‌ణ్ పై స్పెష‌ల్ టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఈ టీజ‌ర్ మొద‌ట్లో ఎంత క్లాసిక్ గా క‌నిసిస్తాడో ఎండ్ లో అంతే ప‌వ‌ర్ ఫుల్ గా క‌నిపిస్తాడు రామ్ చ‌ర‌ణ్..

ఇంకెందుకు లేట్ మీరూ ఓ లుక్కేయండి..

YouTube video

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement