Friday, February 3, 2023

నెట్ ఫ్లిక్స్ లో శ్యామ్ సింగ‌రాయ్ – ఎప్పుడంటే !

ప‌లు చిత్రాలు ఓటీటీ బాట ప‌డుతున్నాయి. థియేట‌ర్స్ లో రిలీజ్ అయినా కూడా ఓటీటీ బాట‌ప‌డుతున్నాయి. ఇప్ప‌టికే పుష్ప చిత్రాన్ని కూడా ఓటీటీలో రిలీజ్ చేశారు. ఇప్పుడు హీరో నాని న‌టించిన శ్యామ్ సింగ‌రాయ్ చిత్రం కూడా ఓటీటీలో సంద‌డి చేయ‌నుంది. ఈ చిత్రాన్ని నెట్ ప్లిక్స్ ఓటీటీ సంస్థ కొనుగోలు చేసిందని స‌మాచారం. ఈ మేర‌కు జనవరి 21 వ తేదీన అంటే శుక్రవారం రోజు నుంచి ‘శ్యామ్‌ సింగరాయ్‌’ నెట్‌ ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్‌ కానుంది. ఇక ఈ ప్రకటన తో న్యాచురల్‌ స్టార్‌ నాని ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. డిసెంబర్‌ 24 వ తేదీ, 2021 ఏడాదిలో విడుదల అయిన ‘శ్యామ్‌ సింగరాయ్‌’ సినిమా ప్రస్తుతం థియేటర్లలో చాలా విజయ వంతంగా నడుస్తోంది. ఇప్పటికే ‘శ్యామ్‌ సింగరాయ్‌’ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా… ఓవర్‌ సీస్‌ లోనూ దుమ్ములేపుతోంది. ఇక ఇప్పటి వరకు ‘శ్యామ్‌ సింగరాయ్‌’ సినిమా రూ.50 కోట్ల కలెక్షన్లను రాబట్టినట్లు సమాచారం అందుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -
   

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement