Saturday, April 20, 2024

హిందీలో శ్యామ్ సింగ‌రాయ్ – హీరోగా ఎవ‌రంటే

శ్యామ్ సింగ‌రాయ్ క‌ల‌క‌త్తా బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కిందీ చిత్రం. ఈ చిత్రాన్ని రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించ‌గా.. నాని డ్యూయల్ రోల్ లో నటించాడు.. నాని సరసన సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్, కృతి శెట్టి హీరోయిన్స్ గా నటించారు. ఈ చిత్రం తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేసారు. ఇప్పుడీ చిత్రం హిందీ రీమేక్ చేయటానికి రంగం సిద్దమైంది. బాలీవుడ్ కు చెందిన పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఈ చిత్రం రీమేక్ రైట్స్ తీసుకుందని సమాచారం. దేవ దాసీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన ‘శ్యామ్ సింగరాయ్’ బెంగాల్ రచయిత కావడంతో ఉత్తరాది ప్రేక్షకులు బాగా ఆదరిస్తారన్న నమ్మకంతో బాలీవుడ్‌లో రీమేక్ చేయాలని భావిస్తున్నారట.అలాగే ఈ చిత్రంలో నటించటానికి షాహిద్ కపూర్,అజయ్ దేవగన్ ఉత్సాహం చూపిస్తున్నారని, వీరిలో ఒకరితో సినిమా ఫైనలైజ్ అవుతుందంటున్నారు. మాగ్జిమం షాహిద్ కపూర్ ఈ చిత్రం రీమేక్ లో చేసే అవకాసం ఉంది. ఓ నెలలో డైరక్టర్ తో సహా ,మిగతావన్నీ ఫైనలైజ్ చేసి ప్రకటన చేస్తారని బాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement