Tuesday, April 23, 2024

దేశంలో తొలి ఓటరు.. అనారోగ్యంతో కన్నుమూసి శ్యామ్ శరణ్ నేగి

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు దేశంలో తొలి ఓటరు శ్యామ్ శరణ్ నేగి. కాగా ఆయన నేడు
హిమాచల్ ప్రదేశ్ లోని తన స్వస్థలం కల్పలో తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. నేగి ఇటీవల పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారు. 106 ఏళ్ల వయసులో నేగి ఓటేయడంపై ప్రధాని నరేంద్ర మోీడ ట్విట్టర్లో స్పందించారు. ఆధునిక యువతకు నేగి స్ఫూర్తి అని ప్రధాని కొనియాడారు. కాగా, నేగి మృతిపై సీఎం జైరాం ఠాకూర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో పూర్తిచేయనున్నట్లు ప్రకటించారు.హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఈ నెల 12న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే! ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఉపయోగించుకోవాలని అధికారులు నేగికి సూచించారు. అయితే, పోలింగ్ కేంద్రానికే వచ్చి ఓటేస్తానని నేగి వారికి స్పష్టం చేశారు. తర్వాత ఆరోగ్యం సహకరించకపోవడంతో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారు. ఈ సందర్భంగా వారు ఆయనను శాలువాతో సత్కరించారు. స్వతంత్ర్య భారత దేశానికి 1951 లో జరిగిన ఎన్నికల్లో శ్యామ్ శరణ్ నేగి ఓటుహక్కును వినియోగించుకున్నారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఇప్పటి వరకు జరిగిన ప్రతీ ఎన్నికల్లో నేగి ఓటేశారు. ఇటీవల పోస్టల్ బ్యాలెట్ ద్వారా 34వ సారి నేగి ఓటుహక్కును వినియోగించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement