Thursday, April 25, 2024

ఫ్లోరిడాలో కాల్పులు.. ప‌దిమందికి గాయాలు.. ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మం

ప్లోరిడాలో కాల్పుల‌కి తెగ‌బ‌డ్డారు న‌లుగురు దుండ‌గులు. ఈ ఘ‌ట‌న‌లో ప‌దిమంది గాయ‌ప‌డ్డారు..వారిలో ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. ఈ విషయాన్ని లేక్‌ల్యాండ్ పోలీసు విభాగం నిర్ధారించింది. డార్క్ బ్లూ కలర్ నిస్సాన్ కారులో వచ్చిన నలుగురు దుండగులు కిటికీ అద్దాలను దించి వాహనాన్ని నెమ్మదిగా పోనిస్తూ కాల్పులకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. కారులో నుంచే వారు కాల్పులకు పాల్పడ్డారని, నిందితులందరూ మ‌గ‌వారేన‌ని చెప్పారు. గాయపడిన వారిలో ముగ్గురిని మాత్రమే అత్యవసర చికిత్సకు తరలించినట్టు తెలిపారు. వారి వయసు 20 నుంచి 35 ఏళ్లలోపు ఉంటుందని పేర్కొన్నారు. ముఖాలు కనిపించకుండా కప్పుకుని కాల్పులకు దిగిన దుండగుల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement