Wednesday, April 24, 2024

పసిడి ప్రియులకు షాక్, మరోసారి పెరిగిన బంగారం ధర, ఇవ్వాల్టి రేట్​ ఎంతంటే

బంగారం మరోసారి షాక్ ఇచ్చింది. వరుసగా మూడో రోజు కూడా ధర పెరిగింది. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాల్లి (ఆదివారం) బంగారం ధరలు ఇలా ఉన్నాయి. బంగారం ధరలు రోజురోజుకూ మారుతున్నాయి. కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వ, వడ్డీ రేట్లు, వివిధ దేశాల మధ్య భౌతిక పరిస్థితులు, డాలర్ విలువ వంటివి ధరపై ఎప్పటికప్పుడు ప్రభావం చూపిస్తుంటారు. కాగా, వరుసగా మూడో రోజు కూడా బంగారం ధరలో పెరుగుదల కన్పిస్తుండటం షాక్ కల్గిస్తోంది. దేశంలోని వివిధ నగరాల్లో ఇవ్వాల బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందాం.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 47 వేల 50 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 51 వేల 330 రూపాయలుంది. ఇక ముంబైలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 47 వేల 50 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 51 వే 330 రూపాయలుంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 47 వేల 50 రూపాయలుండగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 51 వేల 330 రూపాయలుంది.

ఇక బెంగళూరులో కూడా 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 47 వేల 50 రూపాయలైతే, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 51 వేల 330 రూపాయలుంది. చెన్నైలో అత్యధికంగా 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 48 వేల 170 రూపాయలుండగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 52 వేల 550 రూపాయలుంది.

ఇక ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ రాష్ట్రాల్లో అయితే బంగారం ధరలు ఇలా ఉన్నాయి.హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 47 వేల 50 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 51 వేల 330 రూపాయలుంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 47 వేల 50 రూపాయలైతే, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 51 వేల 330 రూపాయలుంది. అటు విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement