Friday, March 29, 2024

యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజ‌శేఖ‌ర్ చిత్రం – శేఖ‌ర్ అప్ డేట్

యాంగ్రీ యంగ్ మ్యాన్ గా పేరు పొందారు హీరో రాజశేఖర్..కాగా ఆయ‌న ప్ర‌ధాన‌పాత్ర‌లో తెరకెక్కుతున్న ‘శేఖర్’ సినిమా పై తాజా అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రాజశేఖర్ లుక్స్ అదిరిపోయింది. థ్రిల్లర్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో రాజశేఖర్..ఇంటెలిజెంట్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. రాజశేఖర్ కూతురు శివాత్మిక ఈ మూవీలో కీ రోల్ ప్లే చేశారు. మ్యాన్ విత్ ద స్కార్ అనే క్యాప్షన్ తో రూపొందుతోంది. కాగా ‘శేఖర్’ చిత్ర టీజర్ ను ఈ నెల 5న విడుదల రిలీజ్ చేస్తున్న‌ట్లు రాజశేఖర్ ట్వి్ట్టర్ వేదికగా తెలిపారు. ఈ ట్వీట్ చూసి సినీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. మ‌రి ఈ చిత్రం రాజ‌శేఖ‌ర్ కి ఏ మేర‌కు విజ‌యాన్ని అందిస్తుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement