Friday, March 29, 2024

రేపటి నుంచి షర్మిల ‘ప్రజాప్రస్థానం’ పాదయాత్ర

వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ‘‘ప్రజాప్రస్థానం’’ పాదయాత్ర రేపటి నుంచి ప్రారంభం కానుంది. నల్గొండ జిల్లా కొండపాక గూడెం నుంచి పాదయాత్రను మొదలు పెట్టనున్నారు. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు లోటస్ పాండ్ నుంచి భారీ కాన్వాయ్‌లో షర్మిల కొండపాక గూడెంకు చేరుకోనున్నారు. అనంతరం కొండపాక గూడెం నుంచి నార్కట్ పల్లి వరకు 5 కిలేమేటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. అనంతరం సాయంత్రం నార్కట్ పల్లిలో భారీ భహిరంగ సభలో షర్మిల పాల్గొని ప్రసంగించనున్నారు. 

కాగా, తెలంగాణ రాజన్న రాజ్యం లక్ష్యంగా ప్రకటించిన వైఎస్ షర్మిల చేవెళ్ల వేదికగా ప్రజాప్రస్థానం పేరిట పాదయాత్ర ప్రారంభించారు. అయితే, గతేడాది నవంబర్‌ 21న స్థానిక ఎన్ని కలు, కరోనా వల్ల పాదయాత్రకు బ్రేక్‌ పడిన విషయం తెలిసిందే. తెలంగాణలోని మొత్తం 90 అసెంబ్లీ, 14 లోక్‌సభ నియోజకవర్గాల మీదుగా దాదాపుగా 14 నెలల పాలుగా 4 వేల కిలో మీటర్ల మేర యాత్ర చేయాలని షర్మిల నిర్ణయించారు. దీనికి అనుగుణంగా రూట్ మ్యాప్ ఖరారు చేసారు. ఈ క్రమంలో తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సెంటిమెంట్ ను కొనసాగిస్తూ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుండే గతంలో షర్మిల పాదయాత్రను ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement