Friday, December 1, 2023

Breaking | ష‌ర్మిల‌కు డ‌బ్బులెక్క‌డి నుంచి వ‌స్తున్న‌య్‌.. వాడూ వీడు అంటే ఘోరంగా తిడ‌తా: జ‌గ్గారెడ్డి ఆగ్ర‌హం

ష‌ర్మిల‌, అనిల్ చ‌రిత్ర అంతా క‌బ్జాలే అని, ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌లు డ‌బ్బులు ఎక్క‌డి నుంచి వ‌స్తున్నాయ‌ని మండిప‌డ్డారు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి. ఇప్ప‌టికీ త‌న వ‌ద్ద అన్ని ఆధారాలున్నాయ‌ని, తెలంగాణ రాష్ట్రంతోపాలు హైద‌రాబాద్ మాదాపూర్‌లో క‌బ్జాల‌కు సంబంధించిన పూర్తి ఆధారాలు త‌న‌వ‌ద్ద ఉన్నాయ‌ని సీరియ‌స్ అయ్యారు. ష‌ర్మిల‌కు క‌రెక్ట్ చ‌రిత్ర లేద‌ని, వాళ్ల ఫ్యామిలీ మొత్తం భూ క‌బ్జాలు, క‌రప్ష‌న్‌లో నెంబ‌ర్ వ‌న్ అని గ‌ట్టిగా ఫైర్ అయ్యారు. వాడూ వీడు అని తిడితే త‌మ‌కు నోరుంద‌ని, పౌరుషం ఉంద‌ని స‌భ పెట్టి మ‌రీ తిట్టేవన్నీ తిడుతాన‌ని అన్నారు. వైఎస్సార్ సీఎం కాక‌ముందు వాళ్లు స్కూటీ మీద తిరిగిన రోజులు లేవా? ఇప్పుడు అంత డ‌బ్బు ఎక్క‌డి నుంచి వ‌చ్చింది అని మండిప‌డ్డారు.

- Advertisement -
   

ఆడ రౌడీలా మారి నోటికొచ్చిన‌ట్టు తెలంగాణ లీడ‌ర్ల‌ను తిడుతోంద‌ని, ఆమె మాన‌సిక ప‌రిస్థితి బాగా లేద‌ని ఎద్దేవా చేశారు. వారి గ‌త ప‌రిస్థితి ఏంటిది.. ఎక్క‌డెక్క‌డ తిరిగింది అనే మొత్తం చ‌రిత్ర త‌న‌కు తెలుసు అని కౌంట‌ర్ ఇచ్చారు. మామూలు కుటుంబం ఉన్న ష‌ర్మిల నీతి వంతురాలు, క‌రప్ష‌న్ చేయ‌లేన‌ట్టుగా మాట్లాడుతుంద‌ని, ఇష్ట‌మున్న‌ట్టు తిడుతోంద‌ని సీరియ‌స్ అయ్యారు. వాళ్ల ఫ్యామిలీ అంతా క‌బ్జాకోరుల‌ని, అంద‌రూ క‌బ్జాకోరులేన‌ని ఓపెన్ డిబేట్ అయినా పెడ‌తాన‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement