Saturday, April 20, 2024

Acharya: ‘శానా కష్టం’ సాంగ్ ప్రోమో.. మెగాస్టార్ తో స్టెప్పులేసిన రెజీనా

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘ఆచార్య’ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్‌ చరణ్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘లాహే లాహే..’, ‘నీలాంబరి’ పాటలకు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది. 

తాజాగా ‘ఆచార్య’ చిత్రంలోని ‘శానా కష్టం’.. అంటూ సాగే లిరికల్ సాంగ్ ను జనవరి 3న సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆ పాటకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటలో మెగాస్టార్ చిరంజీవి అద్భుతమైన స్టెప్పులతో అలరించారు. కాజల్, పూజా హెగ్డే హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ పాటలో ప్రముఖ హీరోయిన్ రెజీనా కసెండ్రా తళుక్కున మెరిసింది. ఈ మూవీకి మణిశర్మ సంగీతాన్ని అందించారు. అతి త్వరలో సినిమాని విడుదల చేయనున్నారు.

YouTube video

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement