Friday, April 19, 2024

Shame: స్ట్రీట్ డాగ్ పై ఓ ముసలోడు ఆ పనిచేశాడు.. సీక్రెట్‌గా వీడియో తీసిన కోడలు..

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణాతి దారుణమైన ఘటన వెలుగుచూసింది. ఓ ముసలోడు శునకంపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో అతని కోడలు సీక్రెట్‌గా వీడియో తీసే ప్రయత్నం చేసింది. అయితే.. ఆ విషయం గమనించి వృద్దుడు ఆమెపై దాడికి యత్నించాడు. ఈ దాడి దృశ్యాలు కూడా ఆ వీడియోలో రికార్డయ్యాయి. ఇప్పుడా ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడం.. విషయం పోలీసుల దాకా వెళ్లడంతో ఆ ఓల్డ్ ఏజ్ పర్సన్ ని అరెస్టు చేశారు.

ఘజియాబాద్‌లోని ఓ ప్రాంతంలో నివసించే 60 ఏళ్ల వృద్దుడు ఈ మధ్య ఓరోజు కుక్కపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాన్ని అతని కోడలు తన సెల్‌ఫోన్ కెమెరాలో సీక్రెట్‌గా రికార్డు చేసింది. ఆ విషయం గమనించిన వృద్దుడు తేరుకుని ఆమెపై దాడికి యత్నించాడు. ఆమె చేతిలోని సెల్‌ఫోన్‌ని లాక్కునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ గరిజింది.. అదంతా కూడా ఆ కెమెరాలో రికార్డయింది. ఈ ఘటనపై వృద్దుడి కోడలు తైసే పీపుల్ ఫర్ యానిమల్ (PFA) అనే జంతు సంరక్షణ సంస్థకు కంప్లెయింట్ చేసింది.

స్పందించిన తైసే పీపుల్ ఫర్ యానిమల్ టీమ్ సభ్యులు వృద్దుడి ఇంటికి చేరుకుని ఘటనా వివరాలు తెలుసుకున్నారు. స్థానికులతో మాట్లాడగా… గతంలోనూ ఆ ముసలోడు ఇలా శునకాలపై లైంగిక దాడికి పాల్పడినట్లు చెప్పారు. దీంతో ఆ టీమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వృద్దుడిని అరెస్ట్ చేశారు. వీడియో ఆధారంగా అతనిపై కేసు నమోదు చేసి కోర్టు ఆదేశాల మేరకు రిమాండుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement