Monday, December 9, 2024

బాలికపై లైంగిక దాడి, నెల రోజులుగా ఆస్పత్రిలో చికిత్స.. బాలల దినోత్సవం రోజు మృతి

తిరుమలగిరి, (ప్రభన్యూస్‌) : ఓ మృగాడి వాంఛకు బాలిక బలైపోయింది. అతని ప్రవర్తన, వ్యవహార తీరుతో భయభ్రాంతులకు గురైన బాలిక అనారోగ్యం బారిన పడింది. దీంతో ఆస్పత్రిలో చేర్చారు. నెల రోజులుగా చికిత్స పొందుతూ బాలల దినోత్సవం రోజున చ‌నిపోయింది. ఈ క్ర‌మంలోనే బాలికపై లైంగిక దాడి జరిగిందన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లా తొండ తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన ఓ విద్యార్థిని స్థానిక
ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది.

12 ఏండ్ల తండ్రి చనిపోవడంతో తల్లి సంరక్షణలో నానమ్మ, తాత ఇంట్లో ఉంటున్నారు. దసరా పండుగ రోజు ఇంట్లో పని మనిషికి అన్నం పెడదామని… ఆమెను పిలుచుకు రావాలని బాలికకు నానమ్మ చెప్పింది. దీంతో బాలిక పనిమనిషి కోసం వెళ్లింది. ఆమె లేకపోవడంతో తిరిగి వస్తున్న విద్యార్థినిని మద్యం మత్తులో ఉన్న అవనగంటి రాజు అనే వ్యక్తి గమనించాడు. రమ్మని పిలిచాడు. ఎందుకోనని బాలిక వెళ్లింది. తాళం చెవి సబ్జా పైన ఉందని చూడాలని బాలికను ఎత్తుకొని, గట్టిగా పట్టుకున్నాడు.

దీంతో సదరు బాలిక భయభ్రాంతులకు గురైంది. విడిచిపెట్టమని ప్రాధేయపడిన ప్రయోజనం లేకపోయింది. చాలా సమయం గడిచినా బాలిక రాకపోయేసరికి ఆమె తల్లి రాజు ఇంటికి వెళ్లి చూడగా అక్కడ కనిపించింది. అప్పటికే బాలిక వణుకుతూ .. భయపడుతూ ఏడ్చింది. రాజు ఇంట్లో భార్య పిల్లలు లేరు. ఒంటరిగా ఉన్నాడు. అప్పటికే దారుణం జరిగిపోయింది. మానవ మృగం రాజును కఠినంగా శిక్షించాలని వివిధ ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

చికిత్స పొందుతూ మృతి…
భయభ్రాంతులకు గురైన మైనర్‌ బాలికను తొలుత తిరుమలగిరి ప్రైవేట్‌ హాస్పిటల్‌ లో చికిత్స చేయించిన ప్రయోజనం లేకపోవడంతో హైదరాబాదులో నెల రోజులుగా చికిత్స చేయించారు. డాక్టర్లు బాలిక భయభ్రాంతులకు, మానసిక వేదనకు గురైందని చెప్పారని, పరిస్థితి విషమించటంతో చికిత్స పొందుతూ బాలల దినోత్సవం రోజు మైనర్‌ బాలిక బలైపోయింది.

- Advertisement -

మిన్నంటిన రోదనలు…
హైదరాబాదు నుంచి మైనర్‌ బాలిక మృతదేహాన్ని తీసుకురావడంతో తల్లి నానమ్మ తాతయ్య బంధువులు తోటి విద్యార్థులు రోదనలు మిన్నంటాయి. ప్రతి రోజూ పాఠశాలకు డ్రెస్‌ వేసుకొని చక్కగా వెళ్లే బాలిక శవమై రావడంతో సహచర విద్యార్థినులు, పరిసర ప్రాంత ప్రజలు కన్నీరు మున్నీరయ్యారు. బాౖెలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు- ఎస్‌ఐ శివకుమార్‌ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement