Thursday, April 25, 2024

యువ‌తి స్కూటీ నెంబ‌ర్ ప్లేట్‌పై ‘SEX’.. ఎందుకిలా?

ఢిల్లీలో ఓ ఫ్యాషన్ డిజైన్ స్టూడెంట్‌కు వింత అనుభ‌వం ఎదురైంది. తన ఇనిస్టిట్యూట్‌కు వెళ్లేందుకు జానకిపురా నుంచి నోయిడాకు మెట్రోలో ప్రయాణం చేసేది. కానీ, కాలేజీకి స్కూటీపై వెళ్లాలనేది ఆమె కోరిక. చాలా కాలంగా తండ్రిని రిక్వెస్ట్ చేస్తే… మొన్న‌టి దీపావళికి స్కూటీ కొనిచ్చాడు. ఆ గిఫ్ట్‌తో చాలా మురిసిపోయింది. కానీ, ఇప్పుడా స్కూటీపై కాలేజీకి వెళ్లేందుకు భ‌య‌ప‌డుతోంది. కారణం స్కూటీకి నెంబ‌ర్ ప్లేట్‌పై SEX అని ఉండటం.

ఢిల్లీ ర‌వాణాశాఖ నుంచి ఆమెకి అలాట్ అయిన నెంబర్ ‘DL 3 S EX****సంఖ్య‌.నెంబర్ ప్లేట్‌పై ఉన్న ఆ ఇంగ్లిష్ అక్షరాల కారణంగా బయటికెళ్లినప్పుడల్లా పోకిరీల నుంచి కామెంట్స్ ఎదురవుతున్నాయి. దీంతో అది ఆమెకు చాలా ఇబ్బందిగా మారింది. కూతురు ఇబ్బంది చూసిన ఆమె తండ్రి ఆర్టీవో ఆఫీసుకు వెళ్లి నెంబర్ మార్చాల‌ని అధికారులకు విజ్ఞప్తి చేశాడు. అయితే అధికారులు దానికి నిరాకరించారు.

ఒకసారి నంబర్ ఇష్యూ చేశాక.. దాన్ని తిరిగి మార్చేందుకు ఎటువంటి ప్రొవిజన్ లేదని చెప్పారు. ఢిల్లీలో చాలా టూవీలర్స్‌కు ఇట్లాంటి సిరీస్ కేటాయించామని… వాటిని మార్చడం కుదరని పని అని తేల్చి చెప్పేశారు. ఢిల్లీలో వాహనాలకు కేటాయించే నెంబ‌ర్ల‌న్నీ DLతో మొదలవుతాయి. ఆ తర్వాత సంబంధిత జిల్లాను బట్టి కేటాయించే నెంబర్, వాహనాన్ని బట్టి ఇచ్చే సింగిల్ లెటర్, రెండక్షరాల లేటెస్ట్ సిరీస్, నాలుగంకెలు.. ఇవన్నీ వరుస క్రమంలో ఉంటాయి. ఉదాహరణకు DL 2 C AD 1234. ఇక్కడ 2 అనే నెంబర్ తూర్పు జిల్లాను సూచిస్తుంది. C అంటే కారు. AD అనేది నంబర్ సిరీస్. అదే టూవీలర్స్ అయితే C లెటర్ స్థానంలో S అనే లెటర్ ఉంటుంది. దాని తర్వాత వచ్చే సిరీస్‌లో EX అనే లెటర్స్‌ ఉండటం ఇప్పుడు ఢిల్లీలో చాలామంది ద్విచక్రవాహనదారులకు ఇబ్బందిగా మారింది.

‘S EX’ అనే నెంబర్ సిరీస్ ఉన్న వాహనదారులు.. ఆ సిరీస్‌తో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. మరోవైపు ఆర్టీవో అధికారులు దాన్ని మార్చడం కుదరద‌ని చెప్తుండటంతో ఆ సిరీస్ కలిగిన వాహనదారులకు తిప్పలు తప్పేలా లేవు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసంఫేస్‌బుక్‌,  ట్విట్టర్   పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement