Wednesday, April 24, 2024

Spl Story | ఏడు జోన్లు, మరిన్ని ఠాణాలు.. విమెన్​ సేఫ్టీకి ఫుల్​ ఇంపార్టెన్స్​

హైదరాబాద్​ పోలీసు విభాగాన్ని రీ ఆర్గనైజ్​ చేయడానికి సీఎం కేసీఆర్​ నేతృత్వంలోని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. చాలాకాలంగా హైదరాబాద్​ పోలీసు వ్యవస్థలో పెద్దగా మార్పులేవీ చేపట్టలేదు. 35 ఏండ్ల తర్వాత సిటీ పోలీసు వ్యవస్థను రీ ఆర్గనైజ్​ చేసేందుకు అధ్యయనం చేయడానికి 30 ఏళ్ల అనుభవమున్న పోలీసు ఉన్నతాధికారులతో కూడి ఉన్నతస్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఉన్న అయిదు జోన్లకు కొత్తగా మరో రెండు జోన్లు ఏర్పాటు కానున్నాయి. వీటిలో కొత్త పోలీసు స్టేషన్లు, మహిళకు ప్రత్యేక ఠాణాలు, ట్రాఫిక్​ స్టేషన్లు కూడా ఉండనున్నాయి.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

‘‘రేయ్​ ఇటు రారా.. గు** బలిసిందా బోసిడికే”అనే మాటలు ఇంతకుముందు పోలీసుల నోటి నుంచి ఎక్కువగా వినిపించేవి. తెలంగాణలో పోలీసు స్టేషన్​కు వెళ్లాలంటేనే ఒకింత జడుసుకునే పరిస్థితులుండేవి. కర్మగాలి ఎవరైనా ఠాణా మెట్లు ఎక్కారంటే, ముందు వారిని నాలుగు దెబ్బలు గట్టిగా పీకిన తర్వాత కానీ, మాటలు షురూ అయ్యేది కాదు. ఇక.. కేసు చిన్నదా, పెద్దదా అన్న తేడా లేకుండా స్టేషనరీ పేరిట పెద్దమొత్తంలో బిల్లులు కట్టించుకునే వారు. ఇది తెలంగాణలో ఒకప్పటి మాట..

ఇప్పుడు తెలంగాణ పోలీసుల తీరు మొత్తానికే మారిపోయింది. రాష్ట్ర పోలీసింగ్​ విధానం దేశంలోనే మాడల్​గా నిలుస్తోంది. సీఎం కేసీఆర్​ ఆధ్వర్యంలో పలు సంస్కరణలు చేపట్టి సక్సెస్​ఫుల్​గా అమలు చేస్తున్నారు. తొలుత పోలీసులకు అత్యంత ఆధునిక వాహనాల సమకూర్చడం మొదలుకుని, ఫ్రెండ్లీ పోలిసింగ్​ వరకు అన్నిటినీ పక్కాగా అమలు చేయడంతో పోలీసులపై ప్రజలకు నమ్మకం, విశ్వాసం పెరిగింది. కేసుల విషయంలోనూ.. నేరాల పరిశోధనలోనూ తెలంగాణ పోలీసులు చాకచక్యంగా వ్యవహరిస్తూ.. ఎన్నో మిస్టరీ కేసులను 24 గంటల వ్యవధిలోనే పరిష్కరించిన దాఖలాలున్నాయి.

అయితే.. తెలంగాణలోని ఇతర జిల్లాల్లో పరిస్థితి ఒకలా ఉంటే.. హైదరాబాద్​లో మాత్రం కాస్త డిఫరెంట్​గా ఉంటుంది. తెల్లవార్లూ రోడ్లమీద తిరిగే వాహనాల రద్దీ, గల్లీల్లో నెలకొనే విపరీత పరిస్థితులపై ఫోకస్​ చేయడం కొంచెం కష్టమైన పనే.. అయినా.. హైదరాబాద్​ సిటీ , రాచకొండ, సైబరాబాద్​ కమిషనరేట్ల పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటుతో కాస్త క్రైమ్​ కంట్రల్​లోకి వచ్చింది. అయితే.. రోజు రోజుకూ అడ్డదిడ్డంగా జరుగుతున్న సిటీ విస్తరణకు తోడు.. అంతే స్పీడ్​గా నగర జనాభా కూడా పెరిగిపోతోంది. దీనికి తగ్గట్టు ఇక్కడ పోలీసు వ్యవస్థ డెవలప్​మెంట్​ జరగడం లేదు.

- Advertisement -

అయితే.. పోలీసు వ్యవస్థను పునర్​వ్యవస్థీకరించేందుకు తెలంగాణ సర్కారు ఓ ప్రాణాళిక చేపట్టింది. 35 సంవత్సరాల తర్వాత.. వేగవంతమైన పట్టణీకరణ మధ్య.. నగర జనాభా పెరుగుతున్నందున హైదరాబాద్ సిటీ పోలీసులు సరిహద్దులను తిరిగి రాయడానికి ఇప్పుడు రెడీగా ఉన్నారు. గతంలో ఐదు జోన్లతో ఉన్న హైదరాబాద్ పోలీసు విభాగాన్ని ఇప్పుడు ఏడు జోన్లుగా మార్చనున్నారు. ఇందులో సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ అనే రెండు కొత్త జోన్లు ఏర్పాటు అవుతున్నాయి.

ఇక.. ఈ ప్రణాళికను అధ్యయనం చేసి కొత్త జోన్లు, ఉన్న డివిజన్ల విభజనను ఖరారు చేసేందుకు మూడు దశాబ్దాల అనుభవం ఉన్న పోలీసు అధికారులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాదాపు ఆరు నెలల పాటు అధికారులు వివిధ ప్రాంతాల్లో పర్యటించి కొత్త పోలీస్ స్టేషన్లు, పాత పోలీస్ స్టేషన్ల అధికార పరిధి పునర్వ్యవస్థీకరణ వంటివి పరిశీలించినట్టు సిటీ పోలీస్​ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.

హైదరాబాద్​ సిటీ జనాభా పెరుగుదల కారణంగా పోలీసు విభాగం రీ ఆర్గనైజేషన్​ అనేది ఇప్పుడు చాలా అవసరం అని సిటీ పోలీస్​ కమిషనర్​ సీవీ ఆనంద్​ అంటున్నారు. 2011 నుండి 2021 వరకు హైదరాబాద్ జనాభా దాదాపు 18 శాతం పెరిగి 80 లక్షలకు చేరుకుంది. ఇక.. చివరిసారిగా 1987లో నగర పోలీసు విభాగాన్ని రీ ఆర్గనైజ్​ చేశారు. అప్పుడు నగర జనాభా దాదాపు 25 లక్షలుగా ఉండేది. కాగా, నగర పోలీసులు కూడా 2002లో సెమీ రీ ఆర్గనైజేషన్​కు లోనయ్యారు. ఆ సమయంలో పోలీసు స్టేషన్ల సంఖ్యను అయితే మార్చలేదు.  

జిల్లా కమిషనర్‌ నేతృత్వంలో రెండు కొత్త జోన్‌ల ఏర్పాటు..

కొత్తగా ఏర్పాటు కానున్న సౌత్​ ఈస్ట్​, సౌత్​ వెస్ట్​ జోన్లకు జిల్లా కమిషనర్​ నేతృత్వం వహించనున్నారు. ఇక.. 11 కొత్త ఏసీపీ డివిజన్లు, 11 కొత్త లా అండ్ ఆర్డర్ స్టేషన్లు కూడా రానున్నాయని రీ ఆర్గనైజేషన్​ నివేదికలో తెలిపారు. మహిళల భద్రత కోసం చెప్పుకోదగిన రీతిలో HCP సెంట్రల్, ఈస్ట్, వెస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ జోన్‌లలో ఒక్కొక్కటి చొప్పున ఐదు కొత్త మహిళా పోలీస్ స్టేషన్లు కూడా ఏర్పాటు కానున్నాయి. 2020 నుండి 13 శాతం పెరిగి ఇప్పుడు 80 లక్షలకు పైగా ఉన్నసిటీ జనాభాలో.. పెరుగుతున్న వాహనాల సంఖ్యకు తగ్గట్టు 13 కొత్త ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేయనున్నారు. దీంతో ట్రాఫిక్ వింగ్ కూడా రీ ఆర్గనైజ్​ కాబోతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement