Monday, November 11, 2024

Breaking: సైన్యం జ‌రిపిన కాల్పుల్లో ఏడుగురు చిన్నారుల మృతి

సైన్యం జరిపిన కాల్పుల్లో ఏడుగురు చిన్నారులు చనిపోగా, మరో 17మంది గాయపడిన ఘటన మ‌య‌న్మార్‌లో చోటుచేసుకుంది. జుంటా సైన్యం జ‌రిపిన కాల్పుల్లో ఏడు మంది చిన్నారులు మృతి చెందగా.. మ‌రో 17 మంది గాయ‌ప‌డ్డారు. ఓ స్కూల్ బిల్డింగ్‌లో రెబ‌ల్స్ త‌ల‌దాచుకున్న‌ట్లు భావించిన సైన్యం త‌మ హెలికాప్ట‌ర్ల‌తో ఆ బిల్డింగ్‌పై కాల్పులు జ‌రిపింది. దీంతో ఆ స్కూల్‌లో ఉన్న ఏడు మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. హెలికాప్ట‌ర్లు జ‌రిపిన కాల్పుల వ‌ల్ల కొంద‌రు పిల్ల‌లు అక్క‌డిక్క‌డే ప్రాణాలు విడిచారు. మృత‌దేహాల‌ను ఆర్మీ త‌ర‌లించిన‌ట్లు స్థానికులు చెబుతున్నారు. స్కూల్ బిల్డింగ్‌కు బుల్లెట్ రంధ్రాలు ప‌డ్డాయి. కొన్ని చోట్ల ర‌క్త‌పు మ‌ర‌క‌లు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement