Thursday, April 25, 2024

చీర‌ల‌తో న‌దిలోకి దూకి స్విమ్మింగ్ చేసిన వృద్ధ మ‌హిళ‌లు.. వైర‌ల్ గా వీడియో

చీర‌ల‌తో ఎతైన బ్రిడ్జి మీది నుండి న‌దిలోకి దూకి స్విమ్మింగ్ చేశారు ప‌లువురు మ‌హిళ‌లు.ఈ సంఘ‌ట‌న త‌మిళ‌నాడులోని తామిర‌బ‌ర‌ణి న‌ది వ‌ద్ద చోటు చేసుకుంది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) అధికారిణి సుప్రియా సాహు ఈ వీడియోని షేర్ చేశారు.20 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో పెద్దవయసు మహిళలు.. చీరలు కట్టుకుని ఆనందంతో నదిలోకి దూకడంలాంటి దృశ్యాలు ఉన్నాయి. వీరంతా నిర్భయంగా, సంతోషంగా కేరింతలు కొడుతున్నారు. ఈ వీడియోను షేర్ చేస్తూ.. ఆమె ఇలా రాసుకొచ్చారు.. తమిళనాడులోని కల్లిడైకురిచి దగ్గరున్న తామిరబర్ని నదిలో ఈ చీరలు ధరించిన పెద్ద వయసులోని మహిళలు డైవింగ్ చేయడం చూసి ఆశ్చర్యపోయాను. అయితే, వారి ఈజ్ అది వారికి సాధారణ వ్యవహారం అని.. వారు అందులో ప్రవీణులని నాకు అర్థమయ్యింది. ఈ వీడియో ఖచ్చితంగా స్ఫూర్తిదాయకమైనది. వీడియో ఎవరు తీశారో తెలియదు. నాకు స్నేహితుని ద్వారా ఫార్వార్డ్ లో వచ్చిందని తెలిపారు.ఈ వీడియోని ట్విట్టర్‌లో 50,000 మంది చూశారు. అనేక మంది కామెంట్లతో వీరి సాహసాన్ని మెచ్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement