Friday, April 19, 2024

చెరుకుర‌సం తీస్తున్న సునీత‌.. ఎలా ఎంజాయ్ చేస్తుందో చూడండి.. (వీడియో)

సింగ‌ర్ సునీత అన్నా.. త‌న పాట అన్నా చాలామంది లైక్ చేస్తారు. ఎప్పుడూ స్మైల్ చేస్తూ.. న‌వ్వుతూ పాడే పాట‌ల‌ను చూసి అభిమానులైతే మైమ‌రిచిపోతారు. ఇక త‌ను సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాక మ‌రింత జోష్ క‌నిపిస్తోంది. అటు పాట‌ల్లో కానీ, ఇటు త‌న వ్య‌క్తిగ‌త జీవితంలో కాని మ‌రో కొత్త అనుభూతిని ఆస్వాదిస్తోంది.

ఇక‌.. ఓ చెరుకు ర‌సం తీసే బండి వ‌ద్ద సునీత ఎంజాయ్ చేస్తున్న వీడియో త‌న ఇన్‌స్టాలో పోస్టు చేసింది. ఎర్ర‌రంగు డ్రెస్ వేసుకున్న సునీత చెరుకు ర‌సం తీసుకునే నాటు బండి వ‌ద్ద తానే స్వ‌యంగా చెరుకు ర‌సం తీయ‌డానికి బండికున్న కాడిని తిప్పుతూ క‌నిపిస్తోంది. అయితే ఒక్క‌సారిగా ఆ కాడి త‌ప్ప‌డంతో ఎగిరి గంతేసి ఇక ప‌ని అయిపోయింద‌న్న‌ట్టుగా న‌వ్వుతుంది.. ఈ వీడియోను మీరూ చూసి ఎంజాయ్ చేయండి..

వీడియో కోసం.. www.prabhanews.com ని క్లిక్​ చేయండి

Advertisement

తాజా వార్తలు

Advertisement