Friday, March 29, 2024

యూఏఈ రెండో అధ్య‌క్షుడు – షేక్ ఖ‌లీఫా బిన్ జాయోద్ అల్ న‌హ్యాన్ మృతి

యూఏఈ రెండో అధ్య‌క్షుడిగా..అబుదాబి ఎమిరేట్ 16వ పాల‌కుడిగా సేవ‌లందించారు షేక్ ఖ‌లీఫా బిన్ జాయోద్ అల్ న‌హ్యాన్. కాగా ఆయ‌న మ‌ర‌ణించారు. ఈ మేర‌కు అధ్య‌క్ష వ్య‌వ‌హారాల మంత్రిత్వ‌శాఖ ప్ర‌క‌ట‌న రిలీజ్ చేసింది. షేక్‌ ఖలీఫా బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ నవంబర్‌ 3, 2004 నుంచి యూఏఈ అధ్యక్షుడిగా..ఆయన తండ్రి షేక్‌ జాయెద్‌ బిన్‌ సుల్తాన్‌ అల్‌ నహ్యాన్‌ వారసుడిగా ఎన్నికయ్యారు. సుల్తాన్‌ 1971 నుంచి నవంబర్ 2, 2004 వరకు మరణించే వరకు యూఏఈ మొదటి అధ్యక్షుడిగా సేవలందించారు. ఆయన పాలనలో యూఏఈ వేగంగా అభివృద్ధి చెందడంతో పాటు ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించారు. అధ్యక్షుడిగా నియామకమైన తర్వాత పౌరుల శ్రేయస్సు, స్థిరమైన అభివృద్ధిని సాధించేందుకు యూఏఈ ప్రభుత్వం తన మొదటి వ్యూహాత్మక ప్రణాళికను ప్రారంభించారు. నార్తర్న్ ఎమిరేట్స్ అవసరాలను అధ్యయనం చేయడానికి యూఏఈ అంతటా విస్తృతంగా పర్యటించడంతో పాటు గృహ నిర్మాణం, విద్య, సామాజిక సేవలకు సంబంధించి అనేక ప్రాజెక్టులకు సంబంధించి సూచనలు చేశారు. ఫెడరల్‌ నేషన్‌ కౌన్సిల్‌ సభ్యుల కోసం నామినేషన్‌ విధానాన్ని అభివృద్ధి చేసేందుకు చొరవ చూపారు. మ‌రి ఇప్పుడు అధ్య‌క్ష ప‌ద‌విని ఎవ‌రు చేప‌డ‌తారో తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement