Tuesday, May 30, 2023

Shame: పాల‌మూరులో కీచ‌కులు, బాలిక‌పై ప‌దే ప‌దే ఆ ప‌ని.. గ‌ర్భిణి కావ‌డంతో..

మ‌హబూబ్‌న‌గ‌ర్‌లో దారుణం జ‌రిగింది. కోయిలకొండలో ఒక బాలికను లొంగ‌దీసుకున్న‌ ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడడంతో ఆమె గర్భవతి అయ్యింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోయిలకొండ మండలంలోని ఒక గ్రామానికి చెందిన ప‌ద‌మూడేళ్ల బాలిక‌పై కొన్ని నెలల క్రితం కోయిలకొండకు చెందిన రవి కుమార్, శ్రీకాంత్ క‌లిసి దారుణానికి పాల్ప‌డ్డారు. ఆ ఊరికి సమీపంలోని పిండిగిర్నిలో అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ త‌ర్వ‌త‌ కూడా బాధితురాలి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పలుమార్లు లైంగిక దాడికి దిగారు. కాగా, వారం రోజుల క్రితం బాలిక‌ కడుపు నొప్పితో బాధపడుతుంటూ త‌ల్లి గ‌మ‌నించింది. గ‌ట్టిగా నిల‌దీయ‌డంతో ఈ విష‌యం త‌ల్లికి తెలిపింది. దీంతో కోయిలకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా గర్భిణి అని తేలింది. ఈ విష‌యాన్ని బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎస్సై శీనయ్య పోక్సో, ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.

నిజాబామాద్​ జిల్లాలోనూ..

- Advertisement -
   

కాగా, నిజామాబాద్ జిల్లాలోనూ ఇట్లాంటి దారుణ ఘటనే ఆలస్యంగా తెలిసింది. దాగుడుమూతల పేరుతో బాలికకు దగ్గరైన ఓ యువకుడు ఆమె న‌గ్న ఫొటోల‌ను సెల్‌ఫోన్‌లో తీసుకున్నాడు. ఆ త‌ర్వాత వాటిని చూపించి బెదిరిస్తూ దారుణానికి పాల్ప‌డ్డాడు. అంతేకాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మ‌రో వ్య‌క్తి కూడా అదే బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ దృశ్యాలను ఫోన్లో బంధించి ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు. వేధింపులు తాళలేక బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో ఈ విష‌యం కాస్త బ‌య‌టికి తెలిసింది. ఏసీపీ వెంకటేశ్వర్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. నిజామాబాద్ 4వ పోలీసు స్టేష‌న్‌ పరిధిలోని ఓ అపార్టుమెంటులో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న బాలిక ప్రస్తుతం 10వ త‌ర‌గ‌తి చదువుతోంది. అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న రోహిత్ 2017నుంచి బాలికతో చనువు పెంచుకుంటూ వస్తున్నాడు. ఒంటరిగా ఉన్నప్పుడు దాగుడు మూతలు ఆట పేరుతో అపార్ట్మెంట్ పై అంతస్తుకు తీసుకెళ్ళేవాడు. ఈ క్రమంలో మూడేళ్లక్రితం బాలిక నగ్న ఫొటోల‌ను ఫోన్ ద్వారా తీసుకున్నాడు. వాటిని చూపించి, బెదిరిస్తూ లైంగికదాడి చేశాడు. రెండేళ్ల క్రితం కూడా అవే చిత్రాలు చూపించి ఇంట్లోకి బలవంతంగా తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఏడాది ఏప్రిల్లోను బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న విషయాన్ని గుర్తించి మరోసారి అత్యాచారం చేశాడు.

ప్రేమ పేరుతో..
ఆ బాలికకు భాను ప్రసాద్ గౌడ్ అనే యువకుడు ఇన్స్టాలో పరిచయమయ్యాడు. అతను ప్రేమ పేరిట బాలికను లొంగదీసుకున్నాడు. మాయ మాటలు చెప్పి ఓ కళ్యాణమండపం సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. దీనికి సంబంధించిన న్యూడ్ ఫొటోలు, వీడియోలు తీశాడు. వాటిని ఆమెకి పంపి బెదిరింపులకు పాల్పడ్డాడు. తనతో పాటు బయటికి రావాలని భయపెట్టడం ప్రారంభించాడు. తన సోదరి వివాహం నిశ్చయమైన నేపథ్యంలో విషయం బయటికి పొక్కితే.. పరువు పోతుందనే భయంతో కొంతకాలంగా ఇద్దరి వేధింపులు భరిస్తూ వచ్చిన బాలిక చివరకు తల్లిదండ్రుల దృష్టికి విషయాన్ని తీసుకు వెళ్ళింది. పోలీసుల‌కు ఈ విష‌యాన్నంతా ఆమె త‌ల్లిద్వారా చేసిన ఫిర్యాదు మేరకు నిందితులు ఇద్దరిపై అత్యాచారం, పోక్సో, అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశామని.. వారి ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ వెల్లడించారు. నిందితుల్లో ఒకరైన రోహిత్ ప్రభుత్వ శాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్నాడని, భాను ప్రసాద్ గల్ఫ్ కు వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాడు అని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement