Thursday, April 25, 2024

తెలంగాణలో ప్రారంభం కానున్న స్కూళ్లు!

తెలంగాణలో విద్యాసంస్థలు ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. అయితే, ఆస్పత్రిలో చేరే వారి సంఖ్య మాత్రం పెరగడం లేదని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. పాజివిటీ రేటు కూడా తక్కువగా ఉంటుందని తెలిపింది. ఈ నేపథ్యంలో విద్యా సంస్థలను ప్రారంభించాలా? లేక ప్రస్తుతం కొనసాగుతున్న సెలవులను మరిన్ని రోజుల పాటు పొడిగించాలా? అనే అంశంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. విద్యా సంస్థల ప్రారంభంపై వివిధ వర్గాల నుంచి వస్తున్న ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని త్వరలోనే తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది.

రాష్ట్రంలో ఈ నెల 8వ తేదీ నుంచి విద్యా సంస్థలను మూసివేసిన విషయం తెలిసిందే. తొలుత 16వ తేదీ వరకు సంక్రాంతి పండుగ సెలవులు ఇచ్చారు. ఆ తర్వాత కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని 30వ తేదీ వరకు సెలవులను పొడిగించారు. ప్రస్తుతం 8,9,10వ తరగతుల విద్యార్థులతో పాటు, ఇంటర్‌, డిగ్రీ విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనవరి 30తో ముగియనున్న సెలవులను పొడిగిస్తారా? లేక విద్యా సంస్థలను ప్రారంభిస్తారా? అన్నది ఉత్కంఠగా మారింది. తాజా సమాచారం ప్రకారం ఈ నెల 31వ తేదీ నుంచి రాష్ట్రంలో విద్యా సంస్థలను తిరిగి తెరవడానికే ప్రభుత్వం మొగ్గు చూపుతుందని తెలుస్తోంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement