Saturday, April 20, 2024

స్కూల్ పై కాల్పులు – 21మంది మృతి – జోబైడెన్ దిగ్భ్రాంతి

18ఏళ్ల యువ‌కుడు ఓ పాఠ‌శాల‌పై కాల్పులు జ‌రిపాడు. దాంతో 21మంది మ‌ర‌ణించారు. కాగా మ‌ర‌ణించిన‌వారిలో 18మంది చిన్నారు ..ముగ్గురు పెద్ద‌వారు ఉన్నార‌ని టెక్సాస్ గ‌వ‌ర్న‌ర్ గ్రెగ్ అబోట్ వెల్ల‌డించారు. ఈ సంఘ‌ట‌న అమెరికా టెక్సాస్‌లోని ఉవాల్డేలో ఉన్న ఓ ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకుంది..పోలీసుల కాల్పుల్లో ఆ యువకుడు హతమయ్యాడని తెలిపారు. గత పదేండ్లలో అమెరికాలోని స్కూళ్లలో జరిగిన కాల్పుల ఘటనల్లో అతిపెద్దది ఇదేనట‌. టెక్సాస్ చరిత్రలో.. అత్యంత దారుణ కాల్పుల ఘటన అని ఆయన చెప్పారు.సల్వడార్‌ రామోస్‌ అనే 18 ఏండ్ల యువకుడు ఉవాల్డేలోని రాబ్‌ ఎలిమెంటరీ స్కూల్‌లోకి ప్రవేశించాడు. తనవెంట తెచ్చుకున్న తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడని పోలీసులు చెప్పారు. దీంతో 21 మంది అక్కడికక్కడే చనిపోగా, పలువురు గాయపడ్డారని తెలిపారు. అయితే ఘటన జరిగిన వెంటనే పోలీసులు ఆ స్కూల్‌ను చుట్టుముట్టారని, వారు జరిపిన కాల్పుల్లో గన్‌మ్యాన్‌ కూడా చనిపోయాడని వెల్లడించారు. కాల్పులకు గల కారణాలు తెలుసుకునేందుకు ఎఫ్‌బీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement