Thursday, April 25, 2024

Alert: తెలంగాణలో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు?

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యా సంస్థల సెలవులను పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. కరోనా విజృంభణ నేపథ్యంలో సంక్రాంతి సెలవులను ఈ నెల 8వ తేదీ నుంచి 16 వరకు ప్రకటించారు. అయితే, కొవిడ్ కేసులు రాష్ట్రంలో రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో సెలవులను మరికొన్ని రోజులు పొడిగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆరోగ్య శాఖ అధికారులు కూడా ఇదే అభిప్రాయాన్ని ప్రభుత్వం వద్ద వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో విద్యా సంస్థల సంక్రాంతి సెలవులను ఈ నెల 20వ తేదీ వరకు పొడిగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే, ప్రభుత్వ నిర్ణయం తర్వాతే ఈ విషయంపై అధికారికంగా ప్రకటిన చేసే అవకాశం ఉంది. అలాగే, ప్రస్తుత పరిస్థుల్లో ఆఫ్‌లైన్ తరగతులను పునఃప్రారంభించడం రిస్క్ అని ఆన్‌లైన్ తరగతులకు బోధించాలని ప్రపాదనలు కూడా వినిపిస్తున్నాయి.

పాఠశాలలు మాత్రమే కాకుండా ఇంటర్మీడియట్, డిగ్రీ కళాశాలలు కూడా జనవరి 17 నుండి ఆన్‌లైన్ తరగతులను ప్రారంభించవచ్చు. జనవరి 17 నుండి ఆన్‌లైన్ తరగతులు పునఃప్రారంభమవుతాయని పలు ప్రైవేట్ సంస్థలు ఇప్పటికే విద్యార్థులకు సమాచారం అందించాయి. మరోవైపు వచ్చే ఆరు వారాల్లో ఓమిక్రాన్ గరిష్ట స్థాయికి చేరుకోవచ్చని, ఆపై ఫిబ్రవరి మధ్యలో తగ్గుదల ఉండవచ్చని రాష్ట్ర ఆరోగ్య శాఖ ఇటీవల ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement