Friday, March 29, 2024

స్కూలు బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో 12మంది వియార్థులకు తీవ్ర గాయాలు

30 మంది స్కూలు పిల్లలతో వెళ్తున్న బస్సును ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో 12 మంది స్కూడెంట్స్​కి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన 44వ నెంబరు జాతీయ రహదారిపై ఇవ్వాల (శుక్రవారం) జరిగింది. రుక్మణి స్కూల్‌కు వెళ్తున్న బస్సు రాంగ్ లేన్‌లో రావడంతో అదే దారిలో వచ్చిన ట్రక్కు ఢీకొట్టింది. 12 మంది చిన్నారులతో పాటు డ్రైవర్ గాయపడగా వారిలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

చండీగఢ్-ఢిల్లీ జాతీయ రహదారి 44పై బస్సు రాంగ్ సైడ్ నుంచి స్కూల్ గేట్‌లోకి ప్రవేశిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు డ్రైవర్ ఎదురుగా ఉన్న అండర్‌పాస్‌ను తీసుకున్నాడు. అతను రోజూ పాఠశాలకు రావడానికి, సమయాన్ని ఆదా చేయడానికి బస్సును ఈ రూట్​లోనే తీసుకువస్తాడు. కాగా, ఘటనకు కారణమైన లారీని పోలీసులు సీజ్ చేశారు. ఈ విషయంలో లోతైన దర్యాప్తు జరుగుతోందని బహల్‌ఘర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ రిషి కాంత్ చెప్పారు. బస్సు డ్రైవర్ తప్పు చేసినట్లు తేలితే అతనిపై చర్యలు తీసుకుంటామన్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement