Monday, March 25, 2024

CAA: పౌరసత్వ సవరణ చట్టం 2019.. ఈనెల 12న అన్ని పిటిషన్లను విచారించనున్న సుప్రీంకోర్టు

సిటిజన్​ షిప్(అమెండ్​మెంట్)​ ఆక్ట్​ (CAA) 2019ని సవాలు చేస్తూ దాఖలైన అన్ని పిటిసనల్​ ఈ నెల 12వ తేదన విచారణకు స్వీకరించనున్నట్టు సుప్రీంకోర్టు ఇవ్వాల (గురువారం) వెల్లడించింది. భారత ప్రధాన న్యాయమూర్తి యుయు లలిత్, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్‌లతో కూడిన ధర్మాసనం సీఏఏను సవాలు చేస్తూ దాఖలైన 220 పిటిషన్లను విచారించనున్నట్టు తెలిపింది.

– డిజిటల్​ మీడియా, ఆంధ్రప్రభ

పౌరసత్వ (సవరణ) చట్టం 2019కి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లు డిసెంబర్ 18, 2019న సుప్రీంకోర్టులో మొదట విచారణకు వచ్చాయి. కాగా, చివరిగా జూన్ 15, 2021న విచారణకు స్వీకరిస్తున్నట్టు ధర్మాసనం తెలిపింది. CAAని డిసెంబర్ 11, 2019న పార్లమెంట్ ఆమోదించింది, ఆ తర్వాత దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అయినా జనవరి 10, 2020 నుండి CAA అమలులోకి వచ్చింది.

కేరళకు చెందిన రాజకీయ పార్టీ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML), తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, కాంగ్రెస్ లీడర్​, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్, ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ నాయకుడు దేబబ్రత సైకియా, NGOలు రిహై మంచ్, సిటిజన్స్ ఎగైనెస్ట్ హేట్, అస్సాం అడ్వకేట్స్ అసోసియేషన్, లా స్టూడెంట్స్ వంటి అనేక మంది ఈ చట్టాన్ని సవాలు చేస్తూ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. 2020లో కేరళ ప్రభుత్వం కూడా CAAని సవాలు చేసిన మొదటి రాష్ట్రంగా సుప్రీం కోర్టులో దావా వేసింది.

సీఏఏను ఎందుకు వ్యతిరేకించారంటే..

- Advertisement -

ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లలో మతపరమైన హింస నుండి పారిపోయి డిసెంబర్ 31, 2014 లేదా అంతకు ముందు భారతదేశంలో ఆశ్రయం పొందిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులకు పౌరసత్వం మంజూరు చేసే ప్రక్రియను ఈ చట్టం ట్రాక్ చేస్తుంది. దీని అమలుపై సుప్రీంకోర్టు గతంలో కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. అయితే.. మార్చి 2020లో CAA చట్టం ఒక “నిరపాయమైన చట్టం” అని పేర్కొంటూ కేంద్రం తన అఫిడవిట్‌ను సుప్రీం కోర్టులో దాఖలు చేసింది. ఇది భారతీయ పౌరులలో ఎవరి “చట్టపరమైన, ప్రజాస్వామ్య లేదా లౌకిక హక్కులను” ప్రభావితం చేయదు అని కేంద్రం ఆ అఫిడవిట్​లో పేర్కొంది. CAA ఏ ప్రాథమిక హక్కును ఉల్లంఘించదని, రాజ్యాంగ నైతికతను ఉల్లంఘించే ప్రశ్నే లేదని కేంద్రం పేర్కొంది.

కాగా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చిన ముస్లిమేతర వలసదారులకు పౌరసత్వం మంజూరు చేయడాన్ని సరళీకరించే.. వేగవంతం చేసే చట్టం మత ఆధారిత వివక్షను ప్రోత్సహిస్తుందని సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.. సెక్యులరిజం, ఆర్టికల్ 21 (జీవించే హక్కు), 15 (మతం, జాతి, కులం, లింగం లేదా జన్మస్థలం ఆధారంగా వివక్షను నిషేధించడం) 19 (హక్కు) వంటి అనేక ఇతర కారణాలపై కూడా సవరణలు సవాలు చేయబడ్డాయి. కాంగ్రెస్ నేత జైరాం రమేష్ దాఖలు చేసిన పిటిషన్‌లో ఈ చట్టం రాజ్యాంగం ప్రకారం అందించిన ప్రాథమిక హక్కులపై “నమ్మకమైన దాడి” అని “సమానులను అసమానంగా” పరిగణిస్తుందని పేర్కొన్నారు.

1955 చట్టానికి 2019 పౌరసత్వ చట్టంలో పలు సవరణలు చేశారు.  చట్టవిరుద్ధంగా వలస వచ్చిన వారు.. హిందూ, సిక్కు, బౌద్ధ, జైన్, పార్సీ లేదా క్రిస్టియన్ కమ్యూనిటీలకు చెందినవారు.. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లేదా పాకిస్థాన్‌కు చెందిన వారైతే పౌరసత్వానికి అర్హులుగా ఇందులో పొందుపరిచారు. ఇది డిసెంబర్ 31, 2014 లేదా అంతకు ముందు భారతదేశంలోకి ప్రవేశించిన వలసదారులకు మాత్రమే వర్తిస్తుందని పేర్కొన్నారు. సవరణ ప్రకారం.. ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు ఈ నిబంధన నుండి మినహాయింపు ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement