Friday, March 29, 2024

బాలికలకు శానిటరీ నాప్​కిన్స్​ ఇవ్వాలని పిటిషన్​.. కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే బాలికలకు ఉచితంగా శానిటరీ ప్యాడ్​లు అందించేలా ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టులో పిల్​ దాఖలైంది. దీనిపై ఇవ్వాల (సోమవారం) విచారణ జరిపిన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వంతోపాటు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి స్పందన తెలియజేయాలని నోటీసులు జారీ చేసింది.  దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 12వ తరగతి చదువుతున్న బాలికలకు ఉచితంగా శానిటరీ ప్యాడ్‌లు అందించాలని మధ్యప్రదేశ్‌కు చెందిన డాక్టర్​, సామాజిక కార్యకర్త జయ ఠాకూర్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్​) దాఖలు చేశారు.

ఆమె అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింతో కూడిన ధర్మాసనం దీన్ని విచారణకు స్వీకరించి.. కేంద్ర ప్రభుత్వానికి, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ, ప్రభుత్వ-ఎయిడెడ్ పాఠశాలల్లోని బాలికల హెల్త్​ పరంగా ఎన్నో సమస్యలు వస్తున్నాయని, వారి విషయంలో పరిశుభ్రతకు ఇంపార్టెన్స్​ ఇవ్వాలని ఆ సమస్యను పిటిషనర్ లేవనెత్తారు. ఈ విషయంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సహాయాన్ని కూడా సుప్రీంకోర్టు కోరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement