Friday, April 26, 2024

Recollect | 50 వేల కోట్లు సమీకరించనున్న ఎస్‌బీఐ

ఈ ఆర్ధిక సంవత్సరంలో ఇండియన్‌, విదేశీ మార్కెట్ల నుంచి డెట్‌ సాధనాల ద్వారా 50,000 కోట్లు సమీకరించనున్నట్లు ఎస్‌బీఐ తెలిపింది. ఈ మేరకు బ్యాంక్‌ బోర్డు నిర్ణయం తీసుకుంది. రుణ సాధనాల జారీ ద్వారా భారతీయ మార్కెట్లు, విదేశీ మార్కెట్ల నుంచి రూపాయిల్లోనూ, మార్చుకునేందుకు వీలైన ఇతర కరెన్సీలోనూ నిధులను సమీకరించాలని బోర్డు నిర్ణయించినట్లు తెలిపింది.

దీర్ఘకాలిక బాండ్‌లు, బాసెల్‌ 3 కంప్లైంట్‌ అదనపు టైర్‌1 బాండ్లు, బాసెల్‌ 3 కంప్లైంట్‌ టైర్‌ 2 బాండ్‌లకు మాత్రమే పరిమితం కాకుండా నిధులను ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ మోడ్‌ ద్వారా సమీకరిస్తామని తెలిపింది. ఎస్‌బీఐ మార్చి త్రైమాసికంలో నికర లాభం 90 శాతం పెరిగి 18,094 కోట్లుగా నమోదైంది. బ్యాంక్‌ అద్భతమైన ఫలితాలను సాధించినందున నిధుల సేకరణ తేలిగ్గానే పూర్తవుతుందని భావిస్తున్నారు. బ్యాంక్‌ నాణ్యమైన ఆస్తుల నిర్వహణ కూడా గణనీయంగా మెరుగుపడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement