Wednesday, March 27, 2024

క‌ళావ‌తికి అదిరిపోయే స్టెప్పులేసిన మ‌హేశ్ బాబు త‌న‌య ‘సితార‌’

స‌ర్కారు వారి చిత్రం నుండి విడుద‌ల‌యిన క‌ళావ‌తి సాంగ్ కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ చిత్రంలో టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు, కీర్తి సురేశ్ న‌టించారు. కాగా, ఈ సినిమా పరశురామ్ దర్శకత్వంలో జీఎంబీ ప్రొడక్షన్స్, మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ సంయుక్తంగా నిర్మించాయి. యూట్యూబ్‌లో క‌ళావ‌తి పాట మిలియ‌న్ల కొద్దీ వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ పాట‌కు తాజాగా మ‌హేశ్ బాబు కూతురు సితార అదిరేటి స్టెప్పులు వేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. సితార వేసిన స్టెప్పుల‌పై మ‌హేశ్ అభిమానులు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement