Wednesday, March 27, 2024

స‌ర్కారు వారి పాట నుండి – ఫ‌స్ట్ సింగిల్ క‌ళావ‌తి పోస్ట‌ర్

యాక్ష‌న్, ఫ్యామిలీ ఎంట‌ర్ టైనర్ చిత్రం స‌ర్కారు వారి పాట‌. ఈ చిత్రాన్ని డైరెక్ట‌ర్ ప‌ర‌శురామ్ తెర‌కెక్కిస్తున్నాడు. ఈ మూవీలో టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు, కీర్తి సురేశ్ జంట‌గా న‌టిస్తున్నారు. ఈ చిత్రం మొదటి సింగిల్ ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదల కానుంది. కళావతి సాంగ్ మెలోడీ సాంగ్‌గా ఉండబోతోంది. ఈ సాంగ్ లో మహేష్ బాబు ,కీర్తి సురేష్ మధ్య మ్యాజికల్ కెమిస్ట్రీని చూపుతోంది. చిత్ర మేకర్స్ ఫ‌స్ట్ సాంగ్ క‌ళావ‌తి నుండి సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.ఈ పోస్టర్‌లో ఎస్ తమన్ సంగీతాన్ని అందించాడు. మునుపెన్నడూ చూడని స్టైలిష్ అవతార్ లో మహేష్ బాబుని ప్రెజెంట్ చేస్తున్నాడు పరశురామ్. మైత్రీ మూవీ మేకర్స్, GMB ఎంటర్‌టైన్‌మెంట్ మరియు 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట , గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆర్ మధి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్‌గా, ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌ను చూసుకుంటున్నారు. సర్కార్ వారి పాట మే 12న వేసవిలో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement