Wednesday, March 27, 2024

థియేటర్ లో ‘సర్కారు వారి పాట’.. ట్విట్టర్ రివ్యూ ఇదే!

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది.

మహేశ్‌బాబుకు జోడిగా కీర్తి సురేశ్‌ నటించిన ఈ చిత్రానికి ‘గీత గోవిందం’ఫేమ్‌ పరశురాం దర్శకత్వం వహించాడు. దర్శకుడు పరశురామ్‌తో మహేష్‌కి మొదటి చిత్రం. అలాగే, కీర్తి సురేష్‌తోనూ మహేష్ తొలిసారి నటించాడు.

భారీ అంచనాల మధ్య నేడు ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద మహేష్ బాబు అభిమానులు హంగామా చేస్తున్నారు.  ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల బొమ్మ పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

ఈ మూవీ మహేశ్‌ కెరీర్‌లో ఇది బెస్ట్‌ మూవీ అని కొందరు అంటున్నారు. ముఖ్యంగా కామెడీలో ఆయన బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడట. సినిమా మహేష్ వన్ మెన్ షో అని అంటున్నారు. బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ కొందరు ట్వీట్లు చేశారు.

https://twitter.com/Trust_101_/status/1524511306786611200
Advertisement

తాజా వార్తలు

Advertisement