Friday, April 26, 2024

Review: సర్కారు వారి పాట.. సినిమా టాక్ ఎలా ఉందంటే..

సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన సినిమా సర్కారు వారి పాట. పరుశురాం డైరెక్ట్ చేసిన ఈ సినిమా నేడు(మే 12) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు సహా ఓవర్సీస్ లోని థియేటర్లలో సందడి చేస్తోంది. సినిమాకు ఓవర్సీస్ నుంచి అదిరిపోయే రిపోర్ట్ వచ్చింది.  మహేష్ బాబు కామెడీ, కీర్తి సురేష్‌తో రొమాంటిక్ ట్రాక్ బాగానే వర్కవుట్ అయింది. యాక్షన్ సీక్వెన్స్ తో మహేష్ నటన  అభిమానుల చేత విజిల్స్ వేయిస్తున్నాయి. తమన్ పాటలు, నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. సినిమా సూపర్ హిట్ అని మహేష్ అభిమానులు అంటున్నారు.

కాగా, ఈ చిత్రం ముందుగా జనవరి 13, 2022న విడుదల కావాల్సి ఉండగా, ఓమిక్రాన్ కేసుల పెరుగుదల మరియు ప్రొడక్షన్ ఆలస్యం కారణంగా వాయిదా పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement