Thursday, April 25, 2024

సీని లవర్స్ కి ముందే సంక్రాంతి.. బంగార్రాజు ట్రైలర్ రిలీజ్.. మామిడితోటకు పోదాం అంటోన్న కృతిశెట్టి!

అక్కినేని తండ్రీకొడుకులు నాగార్జున, నాగచైతన్య కాంబోలో వస్తోన్న మూవీ బంగార్రాజు ఈ నెల 14న (శుక్రవారం) ఈ సినిమా రిలీజ్ కానుంది. మూవీ యూనిట్ తాజాగా బంగార్రాజు ట్రైలర్‌ రిలీజ్ చేసింది. అక్కినేని ఫ్యాన్స్ కు నచ్చేటట్లుగా కమర్షియల్ హంగులతో ఉంది ఈ మూవీ. తాజాగా రిలీజైన ట్రైలర్‌లో ఈ విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. ట్రైలర్‌‌లో నాగార్జున, నాగచైతన్య ఒకే ఫ్రేమ్‌లో కనిపించి ఫ్యాన్స్ ను ఫిదా చేస్తున్నారు.

నాగార్జున, నాగచైతన్యలు మాట్లాడే యాస, మేనరిజం (Mannerism) అదిరిపోయాయి. పల్లెటూరి నేపథ్యంలో సాగే సీన్స్‌తో పండగ శోభను ముందే తీసుకొచ్చింది బంగార్రాజు ట్రైలర్‌. బంగార్రాజు బావగారు చూపులతోనే ఊచకోత కోసేస్తారు అనే డైలాగ్‌తో స్టార్ట్‌ అయ్యే ట్రైలర్‌‌లో.. మొదట నాగార్జున రొమాంటిక్‌ సీన్స్ అదిరిపోయాయి. ట్రైలర్ చివరలో కృతిశెట్టి మామిడి తోటకు వెళ్లి మాట్లాడుకుందామా అని నాగచైతన్యతో చెప్పే డైలాగ్‌కు చైతన్య, నాగార్జున, రమ్యకృష్ణ ఇచ్చే రియాక్షన్ అదుర్స్. కల్యాణ్‌కృష్ణ కురసాల డైరెక్షన్‌లో తెరకెక్కింది ఈ మూవీ. ఇక కృతిశెట్టి, రమ్యకృష్ణ హీరోయిన్స్. బంగార్రాజు మూవీని జీ స్టూడియోస్‌తో కలిసి నాగార్జున నిర్మిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ మ్యూజిక్ అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement