Thursday, April 25, 2024

సంఘ్‌ అంటే మోదీ లేదా వీహెచ్‌పీ కాదు.. ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌

”రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ కేవలం శాఖలు నిర్వహిస్తూ, ప్రజలను దేశం కోసం పనిచేసేలా ప్రోత్సహిస్తుంది” అని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒక స్వయం సేవక్‌, ప్రచారక్‌. ఇప్పుడు కూడా ఆయనొక ప్రచారక్‌గా పనిచేస్తున్నారని భగవత్‌ చెప్పారు. ”ఎప్పుడు సంఘ్‌ పేరు వచ్చినా, మోదీ పేరు ప్రస్తావిస్తారు. అవును, మోదీ ఒక సంఘ్‌ స్వయం సేవక్‌.. ఒక ప్రచారక్‌ కూడా అని ఆయన పేర్కొన్నారు. విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ)ను తమ స్వయం సేవక్‌లు నిర్వహిస్తున్నారని మోహన్‌ భగవత్‌ తెలిపారు.

అయితే, సంఘ్‌ ఎప్పుడు కూడా ప్రత్యక్షంగా లేదా పరోక్షం (రిమోట్‌ కంట్రోల్‌)గా నియంత్రించడం లేదు. వారంతా స్వతంత్రంగా పనిచేస్తున్నారు. మేము సలహాలు, సూచనలు మాత్రమే ఇస్తాం. అయితే తామెప్పుడూ వారిని కంట్రోల్‌ చేయం” అని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ స్పష్టం చేశారు. జబల్పూర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో భగవత్‌ మాట్లాడుతూ… ”భాష, వ్యాపార ఆసక్తి, రాజకీయ శక్తి, ఆలోచన ఆధారంగా భారతదేశం ఒక దేశంగా మారలేదు. భిన్నత్వంలో ఏకత్వం .. వసుదైక కుటుంబం ఆధారంగా ఒకే దేశంగా మారింది” అని పేర్కొన్నారు.

ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ లేదా ఒక రాజకీయ సంస్థ పెద్ద మార్పు చేయదు. హిందుత్వ అంటే అందరినీ ఆలింగనం చేసుకునే తత్వశాస్త్రం, భారత రాజ్యాంగ ప్రవేశిక మాత్రమే హిందుత్వ యొక్క ప్రధాన స్ఫూర్తి” అని మోహన్‌ భగవత్‌ వివరించారు. ప్రజా క్రమశిక్షణ ఆవశ్యకతను నొక్కిచెప్పిన ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌, ధర్మం అంటే మతం లేదా ఆరాధన వ్యవస్థ కాదని, అది క్రమశిక్షణతో విధులు నిర్వర్తించడాన్ని సూచిస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement