Thursday, April 25, 2024

సీఎం కేసీఆర్ స‌హ‌కారంతోనే స‌మ‌తామూర్తి వేడుక‌లు – చిన్న‌జీయర్ స్వామి

చిన్న‌జీయ‌ర్ స్వామి ఆశ్ర‌మంలో విశ్వ స‌మ‌తామూర్తి శ్రీరామానుజాచార్యుల స‌మ‌స్రాబ్ధి వేడుక‌లు ఘ‌నంగా ముగిశాయి. ఈ కార్య‌క్ర‌మాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ హాజ‌రుకాలేదు..అయితే ఈ కార్య‌క్ర‌మానికి తాను ప్ర‌థ‌మ సేవ‌కుడిన‌ని కేసీఆర్ తెలిపార‌ని, ఆయ‌న రాకపోవడానికి అనారోగ్యం లేదా పనుల ఒత్తిడి కారణం అయ్యుంటుందని భావిస్తున్నామన్నారు చిన్న జీయ‌ర్ స్వామి. రేపు నిర్వహిస్తున్న శాంతి కల్యాణానికి కూడా సీఎం కేసీఆర్ ను ఆహ్వానించామని చిన్నజీయర్ స్వామి తెలిపారు. స్వపక్షం, ప్రతిపక్షం అనేవి రాజకీయాల్లోనే ఉంటాయని, తమకు అందరూ సమానమేనని అన్నారు. ప్రతి ఒక్కరూ సమతామూర్తిని సందర్శించాలనేది తమ ఆకాంక్ష అని చెప్పారు. సహస్రాబ్ది వేడుకల రెండో రోజున మాత్రం కేసీఆర్ ముచ్చింతల్ ఆశ్రమానికి వచ్చి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. అంతకుమించి ఆయన ప్రత్యేకంగా సమతామూర్తిని దర్శించుకోలేదు. అయితే, కేసీఆర్ కు, చిన్నజీయర్ స్వామికి మధ్య విభేదాలు తలెత్తాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో చిన్నజీయర్ స్వామి పైవిధంగా స్పందించారు. కేసీఆర్ తో తనకెందుకు విభేదాలు ఉంటాయని ప్రశ్నించారు. కేసీఆర్ సహకారంతోనే ఈ వేడుకలు విజయవంతంగా నిర్వహించగలిగామని చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement