Thursday, April 25, 2024

లాలాజలం (Saliva) టెస్ట్ తో డయాబెటీస్‌, కేన్సర్ గుర్తింపు.. మెడికల్​ పరిశోధనల్లో వెల్లడి

నోటిలోని లాలాజలం (Saliva) నుంచి డజన్ల కొద్దీ వ్యాధులను గుర్తించవచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. మధుమేహం (డ‌యాబెటిస్‌) నుంచి మొద‌లుకుని కేన్సర్ వరకు అన్నివ్యాధులను తెలుసుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. వ్యాధి గురించి ఇన్వెస్టిగేషన్ కూడా మ‌రింత ఈజీ అవుతుందంటున్నారు. తక్కువ సమయంలో ప‌లు ర‌కాల జ‌బ్బుల‌ను కనుగొనవచ్చని చెబుతున్నారు.

మానవ లాలాజలంలో 700 సూక్ష్మజీవులు, యూరిక్ యాసిడ్ వంటి సమ్మేళనాలు ఉన్నాయని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. ఇందులో వ్యాధులను సూచించే అనేక రసాయనాలు ఉంటాయని.. వీటిని బట్టి ఎట్లాంటి వ్యాధులు సంక్రమించాయన్న విష‌యాల‌ను ఈజీగా తెలుసుకోవచ్చు. దత్తా మేఘే యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రొఫెసర్లు ఈ పరిశోధన చేశారు. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరగడం అనేది చాలా విషయాలకు సంకేతమని చెబుతున్నారు. లాలాజలంలో ఉండే యూరిక్ యాసిడ్, వ్యాధుల మధ్య సంబంధాన్ని త‌మ ప‌రిశోధ‌న‌ల్లో క‌నుగొన్నట్టు వెల్లడించారు. యూరిక్ యాసిడ్‌ పెరుగుదల కారణంగా రక్తపోటు పెరుగుతుంద‌ని, అంతే కాకుండా గుండె జబ్బులు, కిడ్నీ, కేన్సర్, బ్లడ్ షుగర్, డయాబెటిస్ తోపాటు.. మ‌రి కొన్ని రకాల కేన్సర్లను కూడా గుర్తించవచ్చని వివ‌రించారు.

యూరిక్ యాసిడ్ అంటే ఏమిటి..
ఈజీగా.. అందరికి అర్థమయ్యేలా చెప్పాలంటే ఇది రక్తంలో కనిపించే ఒక రసాయనం. ఇది ప్యూరిన్ ఎక్కువగా ఉన్న ఆహారాల జీర్ణక్రియ ద్వారా వెలువడుతుంది. బఠానీలు, బచ్చలికూర, పుట్టగొడుగులు, ఎండిన బీన్స్, పంది మాంసం, చికెన్, చేపలు, మటన్, కాలీఫ్లవర్, బీన్స్, బీర్‌లలో ఎక్కువగా ప్యూరిన్లు ఉంటాయి. శరీరంలో ఉత్పత్తి అయ్యే యూరిక్ యాసిడ్ చాలా వరకు రక్తంలో కరిగిపోతుంది. కరిగిపోగా మిగిలినవి మూత్రపిండాల ద్వారా యూరిన్​లో కలిసి బయటికి వస్తాయి. కానీ, శరీరంలో ప్యూరిన్ పరిమాణం ఒక నిర్దిష్ట స్థాయి కంటే ఎక్కువగా పెరిగినప్పుడు మూత్రపిండాలు వాటిని ఫిల్టర్ చేయలేవు. అప్పుడు శరీరంలో యూరిక్ యాసిడ్ పరిమాణం పెరగడం మొదలవుతుంది. దీని కారణంగా హెల్త్​ ఇష్యూస్​ పెరుగుతూ వస్తుంటాయి.

మాల్మో, కాలిఫోర్నియా యూనివర్సిటీల్లోనూ అధ్యయనాలు..
మనుషుల లాలాజలం ద్వారా కేన్సర్, ఇతర తీవ్రమైన అనారోగ్యాల గురించి తెలుసుకోవచ్చని స్వీడన్‌లోని మాల్మో యూనివర్శిటీ ఫ్యాకల్టీ తెలిపారు. అంతేకాకుండా  భవిష్యత్తులో సాధారణ లాలాజల పరీక్ష ద్వారా వారి ప్రారంభ దశలో ఉన్న తీవ్రమైన అనారోగ్యాలను కూడా గుర్తించడం సాధ్యమవుతుందని కనుగొన్నారు.  స్వీడన్‌లోని దక్షిణ ప్రావిన్స్ లో దాదాపు 500 మంది వ్యక్తులతో కూడిన బృందం ఈ అధ్యయనం నిర్వహించినట్టు తెలుస్తోంది.  ఈ పరీక్ష వివిధ రకాల కేన్సర్‌లను గుర్తించడమే కాకుండా మధుమేహం లేదా నాడీ సంబంధిత రుగ్మతలు వంటి ఇతర అనారోగ్యాలను కూడా గుర్తించడానికి ఎంతో ఉపయోగపడుతుందని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజెల్స్ (UCLA) సెంటర్  ఆంకాలజీ రీసెర్చ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డేవిడ్ వాంగ్ చెప్పారు. మోడర్న్​ టెక్నాలజీ అనేది రోగ నిర్ధారణ ప్రక్రియ తీరునే మార్చేస్తుంన్నారు. దీంతో తక్కువ ఖర్చుతోనే మొండి వ్యాధులను ఈజీగా గుర్తించి తగిన చికిత్స అందించే వీలుంటుందని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement