Saturday, April 20, 2024

శృతిహసన్ బర్త్డే గిఫ్ట్ గా.. సలార్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..

అందాల సుందరి, కొలకనుల వయ్యారి శృతి హసన్ ఇవ్వాల బర్త్ డే జరుపుకుంటోంది. ఈ భామ పుట్టిన రోజు సందర్భంగా తనకు ఓ మెమరబుల్ గిఫ్ట్ ప్లాన్ చేసింది సలార్ మూవీ టీమ్. కాగా, వ‌రుస పాన్ ఇండియా సినిమాల‌తొ ఫుల్ బిగా ఉన్నాడు టాలివుడ్ స్టార్.. కాదు కాదు.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్..
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ లో తెర‌కెక్కుతున్న‌ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం సలార్. ఈ చిత్రంలో ప్రభాస్, శృతి హాసన్ లీడ్రోల్ లో నటిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందించగా, భువన్ గౌడ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ ఈ మూవీ నిర్మించారు.


అయితే.. ఇవ్వాల బర్త్డే జరుపుకుంటున్న శృతి బేబీకి తాజాగా చిత్ర భృందం ఓ బంపర్ గిఫ్ట్ ప్లాన్ చేసింది.. ‘sruthi hassan as aadya’ అంటూ వయ్యారి ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసి సంబురాల్లో ముంచెత్తింది. మరి మీరూ సలార్లో ఆద్యగా అలరిస్తున్న శృతిని చూసి ఎంజాయ్ చేయండి.. మీ అభిమాన తారకి బర్త్ డే విషెస్ చెప్పండి..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement