Saturday, April 20, 2024

శాకుంత‌లం కోసం వెయిటింగ్ – నా పాత్ర ఇదే

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం శాకుంత‌లం. ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ తెర‌కెక్కిస్తున్నాడు. కాగా ఈ మూవీ షూంటింగ్ పూర్తి అయింది. నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. స‌మంత‌కి జంట‌గా దేవ్ మోహ‌న్ న‌టిస్తున్నాడు. అసుర మ‌హారాజుగా క‌బీర్ దుహాన్ సింగ్ న‌టించాడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ శాకుంత‌లంలో నా పాత్ర, హీరో పాత్ర‌తో పోరాడుతుంద‌న్నారు. పది కేజీల బరువు ఉండే కిరీటాన్ని పెట్టారు. బరువైన ఆభరణాలను నా మెడలో వేశారు. కిరీటం జారిపోకుండా చూసుకుంటూ .. ఆ బరువును మోస్తూ కత్తి యుద్ధం చేయవలసి ఉంటుంది. అలవాటు లేకపోవడం వలన తాను చాలా ఇబ్బందిపడ్డానని తెలిపాడు. గుణశేఖర్ చాలా గొప్ప డైరెక్టర్. ఆర్టిస్టుల నుంచి తనకి కావలసిన అవుట్ పుట్ ను రాబట్టే తీరు నాకు బాగా నచ్చింది. సమంత – దేవ్ మోహన్ కూడా బాగా చేశారు. ఈ సినిమా కోసం నేను పని చేసిన ప్రతి రోజు నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. నన్ను నేను కొత్తగా చూసుకునే ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తున్నాన‌ని వెల్ల‌డించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement