Thursday, September 16, 2021

అపోలో ఆస్పత్రికి సాయి ధరమ్ తేజ్… హాస్పిటల్ లో పవన్ కళ్యాణ్

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హీరో సాయిధరమ్‌ తేజ్‌ను అపోలో ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అపోలో ఆస్పత్రికి  తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సాయిధరమ్‌ తేజ్‌కు డాక్టర్లు స్కాన్‌ చేశారు. బ్రెయిన్ కి సంబంధించి ఎంఆర్ఐ స్కాన్ తీశారు. రిపోర్ట్స్ నార్మల్ గా ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు.

హైదరాబాద్​లోని కేబుల్ బ్రిడ్జి మీద స్పోర్ట్స్​ బైక్​పై వెళ్తున్న క్రమంలో జారిపడటం వల్ల అతడికి కన్ను, ఛాతి, పొట్ట భాగంలో తీవ్రగాయాలయ్యాయి.ఐకియా కూడలి వద్ద స్పోర్ట్స్ బైక్​పై నుంచి సాయిధరమ్ తేజ్ కిందపడ్డారు. గచ్చిబౌలి నుంచి వస్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో మాదాపుర్ లోని మెడికవర్ ఆస్పత్రిలో చేర్పించారు. సాయిధరమ్‌ తేజ్‌కు డాక్టర్లు స్కాన్‌ చేశారు. బ్రెయిన్ కి సంబంధించి ఎంఆర్ఐ స్కాన్ తీశారు. రిపోర్ట్స్ నార్మల్ గా ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య

సమాచారం అందిన వెంటనే ఆస్పత్రికి చేరుకున్న కుటుంబసభ్యులు… చిరంజీవి, పవన్‌కల్యాణ్‌, అల్లు అరవింద్‌, తదితరులు తేజ్​ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అవుట్ ఆఫ్ డేంజర్ అని డాక్టర్లు చెప్పారు. సాయిధరమ్ తేజ్ స్పృహలోకి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రమాదమేమీ లేదని మెడికవర్ డాక్టర్లు అన్నారు. దీంతో తేజ్ కుటుంబసభ్యులు, అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.

కాగా, అతి వేగమే ప్రమాదానికి కారణం అని ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాద సమయంలో బైక్ వేగం 120 కిలోమీటర్ల నుంచి 140 కిలోమీటర్లు ఉన్నట్టు సమాచారం. బైక్‌ను నియంత్రించలేక అదుపుతప్పి కిందపడిపోయినట్లు పోలీసులు తెలిపారు. కాగా, హెల్మెట్ పెట్టుకోవడం వల్లే తలకు స్వల్పంగా గాయాలైనట్టు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News