Friday, February 3, 2023

Hyderabad | అపార్ట్‌మెంట్ నిర్మాణం పేరుతో 530 కోట్ల వ‌సూలు.. నిర్మాణం చేపట్టని సాహితీ ఇన్‌ఫ్రా ఎండీ అరెస్టు

అపార్ట్ నిర్మాణం పేరుతో క‌స్ట‌మ‌ర్ల నుంచి పెద్ద మొత్తంలో డ‌బ్బులు వ‌సూలు చేసి క‌న్‌స్ట్ర‌క్ష‌న్ ప్రారంభించ‌కుండా మోసం చేసిన కేసులో హైద‌రాబాద్‌కు చెందిన సాహితీ ఇన్‌ఫ్రా గ్రూప్ ఎండీ ల‌క్ష్మినారాయ‌ణ‌ని పోలీసులు ఇవ్వాల అరెస్టు చేశారు. అమీన్‌పూర్‌లో ప్రీ లాంచ్ పేరుతో 1700 మంది క‌స్ట‌మ‌ర్ల నుంచి 530 కోట్ల రూపాయ‌లు వ‌సూలు చేసిన‌ట్టు తెలుస్తోంది. 38 అంత‌స్థులు నిర్మించి ఇస్తామ‌ని న‌మ్మ‌కంగా క‌స్ట‌మ‌ర్ల నుంచి పెద్ద‌మొత్తంలో డ‌బ్బులు వ‌సూలు చేశారు. అయితే చాలాకాలంగా ప‌నులు మొదలు పెట్ట‌క‌పోవ‌డంతో క‌స్ట‌మ‌ర్లు తాము మోస‌పోయామ‌ని గుర్తించారు. దీంతో పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

- Advertisement -
   

కస్టమర్ల ఫిర్యాదుతో హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. కాగా, ప్రాజెక్ట్ ఫెయిల్ కావడంతో 18 శాతం వడ్డీతో డబ్బులు తిరిగి ఇస్తానని లక్ష్మీనారాయణ ఇచ్చిన చెక్స్ కూడా బౌన్స్ అయిన‌ట్టు తెలుస్తోంది. దీంతో ఆగ్ర‌హించిన క‌స్ట‌మ‌ర్లు చాలామంది సీసీఎస్ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో అత‌డిని ఇవ్వాల రాత్రి అరెస్టు చేసిన‌ట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement