Friday, April 19, 2024

Safety: హెల్మెట్, మాస్క్ కంప‌ల్స‌రీ.. లేకుంటే రూ.1000 ఫైన్‌

సిటీ రోడ్ల‌పై యాక్సిడెంట్లు, డెత్‌ల‌ను త‌గ్గించేందుకు హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. బైక్‌ల‌పై వెళ్లే రైడ‌ర్‌తో పాటు వెనుకాల కూర్చొనే వారు కూడా కంప‌ల్స‌రీ హెల్మెట్ పెట్టుకోవాల‌ని ట్రాఫిక్ పోలీసులు రూల్స్ పెట్టారు. ఆ ఇద్ద‌రూ హెల్మెట్ ధ‌రించ‌కుంటే.. చ‌లాన్ జారీ చేస్తామ‌న్నారు.

అయితే.. రైడ‌ర్‌తో పాటు వెనుకాల కూర్చున్న వ్య‌క్తి కూడా ప‌లు ప్ర‌మాదాల్లో చ‌నిపోయిన ఘ‌ట‌న‌లున్నాయి. దీంతో హెల్మెట్ ధ‌రించాల‌నే నిబంధ‌న‌ను క‌ఠినంగా అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు పోలీసులు తెలిపారు. మోటార్ వెహిక‌ల్ యాక్ట్ 1989 ప్ర‌కారం.. హెల్మెట్ ధ‌రించ‌కుండా వాహ‌నం న‌డిపితే రూ.100 జ‌రిమానా విధిస్తున్నారు. వెనుకాల కూర్చొనే వ్య‌క్తి హెల్మెట్ ధ‌రించ‌క‌పోయిన రూ.100 జ‌రిమానా విధిస్తూ చ‌లాన్లు జారీ చేస్తామ‌ని పోలీసులు స్ప‌ష్టం చేశారు.

క‌రోనా నెమ్మ‌దించిన నేప‌థ్యంలో చాలామంది వాహ‌న‌దారులు కొవిడ్ సేఫ్టీ నిబంధ‌న‌లు పాటించ‌డం లేద‌ని పోలీసులు తెలిపారు. మాస్కులు ధ‌రించ‌కుండా రోడ్ల‌మీదికి వ‌స్తున్న‌ట్టు చెప్పారు. త‌ప్ప‌నిసరిగా హెల్మెట్ ధ‌రించాల‌నే కండిష‌న్‌తో పాటు మాస్కు కూడా మ‌స్ట్ చేస్తూ చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.

సీసీ కెమెరాలు, ఆర్టిఫిషీయ‌ల్ ఇంటెలిజెన్స్ ద్వారా మాస్కు ధ‌రించ‌ని వారిని గుర్తించి ఫైన్ వేయ‌నున్న‌ట్టు పోలీసులు తెలిపారు. మాస్కు ధ‌రించ‌కుండా బైక్‌ల‌పై ప్ర‌యాణించే వారికి రూ.1000 ఫైన్ వేస్తామ‌ని పోలీసులు స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement