Tuesday, October 19, 2021

సైదాబాద్ నిందితుడు రాజు ఆత్మహత్య

తెలంగాణలో సంచలనం రేపిన సైదాబాద్ సింగరేణి కాలనీ అత్యాచార ఘటనలో నిందితుడు రాజు ఆత్మహత్య  చేసుకున్నాడు. వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ సమీపంలోని నిందితుడు రాజు ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. రైల్వే ట్రాక్‌వద్ద రాజు మృతదేహం లభ్యమైంది. అయితే, మృతుడి చేతిపై టాటుతోపాటు చేతిపై మౌనిక అనే పచ్చబొట్టు ఆధారంగా మృతున్ని రాజుగా గుర్తించినట్టు సమాచారం. 

హైదరాబాద్‌లోని సింగరేణి కాలనీలో తోటిపిల్లలతో కలసి ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారికి సెప్టెంబర్‌ 9న చాక్లెట్‌ ఆశ చూపి తీసుకెళ్లి నిందితుడు రాజు అత్యాచారం చేసి హత్య సంగతి తెలిసిందే. ఈ ఘటనపై  కుటుంబసభ్యులు, స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బాధితులపై  లాఠీచార్జీ మృతదేహన్ని పోలీసులు పోస్టుమార్టానికి తరలించారు.  చిన్నారి తల్లిదండ్రులు నల్లగొండ జిల్లా దేవరకొండ సమీప తండాకు చెందిన వాసులు కాగా.. బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చి సింగరేణి కాలనీలో నివసిస్తున్నారు. ఈ సమయంలోనే ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఇక ఈ ఘటనపై పలు సంఘాలు, సామాజికవేత్తలు నిరసనలు తెలిపారు. నిందితుడిని ఎన్ కౌంటర్ చేయాలంటూ డిమాండ్ లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం.

పోలీసులు గాలింపు ముమ్మరం చేయడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో రాజు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు. పోలీసులకు చిక్కి ఎన్‌కౌంటర్ కావడం కంటే తనకు తానే ప్రాణాలు తీసుకోవడం మేలని ఆలోచించే రాజు బలవన్మరణానికి పాల్పడి ఉంటాడని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

కాగా, ఆ మృతదేహం నిందితుడు రాజుదేనని నిర్ధారించామని, అతడి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చామని తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. రాజు ఆత్మహత్య చేసుకున్న విషయంపై డీజీపీ తనకు సమాచారమిచ్చారని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News