Tuesday, April 23, 2024

AP: రైతులకు గుడ్ న్యూస్.. మే 16న రైతు భరోసా.. జూన్‌ లో పంట బీమా పరిహారం..

మే 16న వైఎస్ఆర్ రైతు భరోసా నిధుల విడుదల చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. రైతు భరోసా, రైతులకు పంట బీమా చెల్లింపు, సబ్సిడీపై రైతులకు వ్యవసాయ ఉపకరణాల పంపిణీ, ఖరీఫ్‌ సన్నద్ధత, కిసాన్‌ డ్రోన్లు, మిల్లెట్‌ పాలసీ, పంట మార్పిడి తదితర అంశాలపై సీఎం సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సదర్భంగా సీఎం మాట్లాడుతూ జూన్‌లో 3 వేల ట్రాక్టర్లతో సహా 4014 వ్యవసాయ పరికరాలు పంపిణీకి ఆదేశించారు. జూన్ 15లోపు పంట నష్ట పరిహారం పంపిణీ చేస్తామన్నారు. పారదర్శకంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. ఖరీఫ్‌లో విత్తనాలు, ఎరువుల పంపిణీకి, రైతు కోరిన కంపెనీతో డ్రిప్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.

రాష్ట్రంలో వ్యవసాయ రంగ పరిస్థితులను సీఎం అధికారులు వివరించారు. 2021 ఖరీఫ్‌లో 90.77 లక్షల ఎకరాల్లో పంటలు సాగు జరగగా.. రబీ 2021–22లో 54.54 లక్షల ఎకరాల్లో పంటసాగు అయినట్లు తెలిపారు. 2020–21లో ఆహార ఉత్పత్తులు 165.07 లక్షల మెట్రిక్‌ టన్నులు, 2021–22లో 171.7 లక్షల మెట్రిక్‌ టన్నులు దిగుబడి వచ్చినట్లు చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే.. ఈఏడాది 4శాతం అధికంగా వ్యవసాయ ఉత్పత్తులు జరిగాయన్నారు.  2021 ఖరీఫ్‌లో వరి, మినుములు, పెసలు, పత్తి ఉత్పత్తులు గత ఏడాదితో పోలిస్తే..  పెరిగందన్నారు. రాష్ట్రంలో అనుకూల పరిస్థితులతో వరుసగా మూడో పంటకూ రైతులు సిద్ధమన్నారు. ఇప్పటివరకూ 66,803 హెక్టార్లలో మూడోపంట సాగు రికార్డు సృష్టించింది.  ఇది లక్ష హెక్టార్లు దాటే అవకాశాలున్నాయన్న అధికారులు.. గత ఏడాదితో పోలిస్తే 477శాతం మూడో పంట సాగు విస్తీర్ణం పెరిగిన్నట్లు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement