Thursday, April 25, 2024

మెట్ల‌పై నుంచి జారిప‌డిన ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్..!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆరోగ్యంపై అంతర్జాతీయ మీడియాలో ప‌లు వార్తలు వ‌స్తున్నాయి. ఇప్పటికే పుతిన్‌ చేతులు పర్పుల్‌ రంగులోకి మారిపోయాయని, గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధడుతున్నారని రష్యా అధ్యక్షుడి ఆరోగ్యంపై వరుసగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా.. మాస్కోలోని తన అధికారిక నివాసంలో మెట్లపై నుంచి జారిపడినట్లు న్యూయార్క్‌ పోస్టు వెల్లడించింది. మెట్లు దిగుతుండగా కాలుజారీ ఐదు మెట్లకు కింద పడిపోయినట్లు తెలిపింది. దీంతో పుతిన్‌ తుంటి ఎముక విరిగిపోయినట్లు పేర్కొన్నది. దీనికారణంగా అతని ప్రమేయం లేకుండానే మలమూత్ర విసర్జన జరుగుతుందని, ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తన కథనంలో తెలిపింది. అయితే దీనిపై క్రెమ్లిన్‌ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement