Saturday, April 20, 2024

Russia Ukraine war: ఉక్రెయిన్‌ నగరాలపై క్షిపణుల దాడి

రష్యా – ఉక్రెయిన్ దేశాల మధ్య భీకర యుద్ధం ఇంకా కొనసాగుతోంది. క్రేన బాంబుల వర్షం కురిపిస్తోంది

రాజధాని కీవ్‌ సహా పలు నగరాలపై రష్యన్‌ సేనలు క్షిపణులు, బాంబులతో భీకర దాడులకు పాల్పడుతున్నాయి. కీవ్‌పై పట్టు కోసం రష్యన్ సేనలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అయితే వారికి ధీటుగా సుప్రీఉక్రేనియన్‌ కూడా ఎదుర్కొంటోంది. ఉక్రేనియన్‌ దళాలు ప్రతిఘటిస్తుండటంతో మాస్కో బలగాలు కష్టపడాల్సి వస్తోంది. ఇప్పటికే రెండు అణు విద్యుత్‌ కేంద్రాలను ఆదీనంలోకి తీసుకున్న రష్యా దళాలు ఇప్పుడు మరో అణువిద్యుత్‌ కేంద్రంపై దృష్టి సారించాయి. చెర్నోబిల్‌, జపోరిజియా న్యూక్లియర్‌ పవర్‌ ప్లాంట్లు ఇప్పటికే పుతిన్‌ సేనల ఆధీనంలో ఉండగా మూడో అణువిద్యుత్‌ కేంద్రమైన యుజ్నౌక్రైన్స్క్‌ను స్వాధీనంచేసుకునే దిశగా రష్యా అడుగులు వేస్తోంది. ఈ అణువిద్యుత్ కేంద్రం ఉన్న మైకోలైవ్ పట్టణానికి ఉత్తరంగా 120 కిలోమీటర్ల దూరంలో రష్యా బలగాలు ఉన్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్​స్కీ తెలిపారు. ఎయిర్ పోర్టులతోపాటు అన్ని ప్రాంతాల్లో రష్యా బాంబుల వర్షం కురిపిస్తోందని ఆరోపించారు. నల్ల సముద్రం తీరప్రాంతంలోని ఒడెస్సా నగరంపై మరోసారి బాంబుదాడులు చేసేందుకు రష్యా బలగాలు సిద్ధమవుతున్నాయని జెలెన్​స్కీ అన్నారు. ఉక్రెయిన్‌ గగనతలాన్ని నో ఫ్లైజోన్‌గా ప్రకటించాలని జెలెన్‌స్కీ మరోసారి నాటో దేశాధినేతలను కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement