Tuesday, April 23, 2024

సినీ ప‌రిశ్ర‌మ‌లో వ‌దంతులు సాధార‌ణ‌మే – సుమ‌

సినీ ప‌రిశ్ర‌మ‌లో వ‌దంతులు సాధార‌ణ‌మే అంటోంది స్టార్ యాంక‌ర్ , న‌టి సుమ‌. ఈమె ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ’ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. త‌న భ‌ర్త రాజీవ్ క‌న‌కాల‌తో విభేదాలు వ‌చ్చాయంటూ వ‌స్తోన్న వార్త‌ల‌పై స్పందించింది. త‌మ‌ పెళ్లయి 23 ఏళ్లు అవుతోంద‌ని, తాము చాలా సంతోషంగా ఉన్నామ‌ని చెప్పింది. త‌మ‌పై వ‌దంతులు వచ్చినప్పుడు తాను త‌మ వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు అప్‌లోడ్ చేస్తాన‌ని తెలిపింది. వాటి ద్వారా ఆ వ‌దంతుల‌కు కొంతవరకైనా చెక్‌ పెట్టే ప్రయత్నం చేస్తానని వివ‌రించింది. సినీ ప‌రిశ్ర‌మ‌లో ఇలాంటి వదంతులు సాధారణమేన‌ని, సెలబ్రిటీలు అన్న తర్వాత ఇలాంటివి తప్పదని వ్యాఖ్యానించింది.అటువంటి వాటి వల్ల మానసికంగా బాధ కలిగినా అందుకు అలవాటుపడి పోయామ‌ని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement