Friday, May 20, 2022

ఆర్టీసీని ప్రెవేటీక‌ర‌ణ చేయ‌బోం – వెయ్యి కొత్త బ‌స్సులు కొనుగోలు – ఛైర్మ‌న్ బాజిరెడ్డి

త్వ‌ర‌లో వెయ్యి కొత్త బ‌స్సుల‌ను కొనుగోలు చేయ‌బోతున్నామ‌ని స్ప‌ష్టం చేశారు చైర్మ‌న్ బాజిరెడ్డి. నిజమాబాద్ నగరంలో సిటీ మెట్రో బస్సు సర్వీసులను ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, అర్బన్ ఎమ్మెల్యే భిగాల గణేష్ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తున్నట్లు ప్రతిపక్షాలు తప్పుడు ప్రకటనలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆర్టీసీని అభివృద్ధి లోకి తెచ్చే సలహాలు ఇవ్వాలి తప్పా.. చౌకా బారు ప్రకటనలు మానుకోవాలని హెచ్చరించారు. డిపో లను ఎత్తి వేసే ఆలోచన లేదని… ఆర్టీసీ లో కార్మికులను వేధింపులకు పాల్పడినట్లు దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు చైర్మన్ బాజిరెడ్డి. ఆర్టీసీని ప్రైవేటీకరణ అసలు చేయబోమని క్లారిటీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement